STOCKS

News


పసిడికి అమెరికా ఎన్నికల ఫలితాలు జోష్‌

Wednesday 7th November 2018
Markets_main1541585904.png-21773

అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు పసిడి ధరకి ఉత్సాహానిస్తున్నాయి. ఆసియా ట్రేడింగ్‌లో బుధవారం భారత వర్తమానకాలం ప్రకారం మధ్యాహ్నం గం.2.20లకు ఔన్స్‌ పసిడి 8.10డాలర్లు పెరిగి 1,234.20 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో పాలకపక్షమైన రిపబ్లిక్‌ పార్టీకి ఎదురుగాలి వీస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు రక్షణాత్మక ధోరణిని అవలంభిస్తున్నారు. ఫలితాలు ప్రతిపక్షపార్టికి అనుకూలంగా వస్తుడంతో మార్కెట్లో అనిశ్చితి వాతవరణ పరిస్థితలు నెలకొనవచ్చనే అంచనాలతో ఇన్వెస్టర్లు పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు పసిడి ధరపై ప్రభావాన్ని చూపే డాలర్‌ ఇండెక్స్‌ కూడా ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో పతనం కూడా పసిడి ర్యాలీకి కలిసొచ్చింది. డాలర్‌ ఇండెక్స్‌ నేటి ఇంట్రాడేలో అరశాతానికి పైగా నష్టపోయి 95.54  పాయింట్ల కనిష్టాని వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు ఆసియా మార్కెట్లో పసిడి ధర భారీగా ర్యాలీ చేస్తుంది. నేడు ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 1,228.50 డాలర్ల వద్ద ట్రేడ్ ప్రారంభమైంది. అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో  డెమోక్రాట్లు మెజారిటీ పెరిగే కొద్ది ఇక్కడ ఆసియా ట్రేడింగ్‌లో పసిడి ఫ్యూచర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో ఒకానోక దశలో 8.60డాలర్లు లాభపడి రూ 1,235 డాలర్ల గరిష్టాన్ని తాకింది.   ఇక రాత్రి అమెరికా మార్కెట్లో పసిడి ఫ్యూచర్‌ ట్రేడింగ్‌ విషయానికొస్తే...మధ్యంతర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లపై ఆసక్తి చూపలేదు. ఫలితంగా అక్కడ ఔన్స్‌పసిడి ధర వారం కనిష్టస్థాయి 1,223.80 డాలర్లకు తాకింది. చివరికి 1,226.30 డాలర్ల వద్ద ముగిసింది.
దేశీయంగానూ నష్టాల ముగింపు:-
రాత్రి ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి బలపడంతో ఎంసీక్స్‌లో పసిడి ధర స్వల్పంగా నష్టపోయింది. డాలర్‌ మారకంలో రూపాయి 12 పైసలు బలపడి 73 స్థాయి వద్ద ముగిసింది. రూపాయి బలపడంతో 10గ్రాముల పసిడి రూ.56.00లు నష్టపోయి రూ.31646.00ల వద్ద స్థిరపడింది.



You may be interested

మిశ్రమంగా ముగిసిన ఆసియా మార్కెట్లు

Wednesday 7th November 2018

మార్కెట్‌ వర్గాలు ఊహించినట్లుగానే అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమెక్రటిక్‌ పార్టీ విజయం సాధించడంతో బుధవారం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఆసియాలో జపాన్‌ మార్కెట్‌ ప్రధాన సూచీ నికాయ్‌ 225(0.28శాతం), చైనాకు చెందిన షాంఘై సూచీ(0.68శాతం),  దక్షిణ కొరియాకు దేశపు కోప్సీ సూచీ(0.53)లు నష్టపోయాయి. మిగిలిన అన్ని దేశపు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అత్యధికంగా తైవాన్‌ మార్కెట్‌ 1శాతం ర్యాలీ చేసింది. దానితో పాటు సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్స్ టైమ్స్,

రూ.25 కోట్ల రికవరీకి ఎన్‌సీఎల్‌టీకి ఇండస్‌ఇండ్‌

Wednesday 7th November 2018

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభంలో తాజా పరిమాణం న్యూఢిల్లీ: సంక్షోభంలో కూరుకుపోయిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ నుంచి రావాల్సిన రూ.25 కోట్ల వడ్డీ రికవరీకి ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ఎన్‌సీఎల్‌ఏటీ (నేషనల్‌ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌)ని ఆశ్రయించింది. ఈ అంశంపై ప్రభుత్వానికి జస్టిస్‌ ఎస్‌జే ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ఇరువురు సభ్యుల ఎన్‌సీఎల్‌ఏటీ బెంచ్‌ నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ప్రధాన కేసు విచారణ జరిగే నవంబర్‌ 13వ తేదీకే ఇండస్‌ఇండ్‌ తాజా పిటిషన్‌పై విచారణనూ

Most from this category