STOCKS

News


బలపడిన పసిడి

Monday 24th December 2018
Markets_main1545625448.png-23190

అమెరికాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి పరిస్థితులు సోమవారం పసిడి ధరను పరుగులు పెట్టిస్తున్నాయి. ఫలితంగా ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ సెషన్స్‌లోనే ఔన్స్‌ పసిడి ధర 9డాలర్లు లాభపడింది. గతవారంలో మార్కెట్లకు చివరి రోజైన శుక్రవారం అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లు కిస్మస్‌(మంగళవారం) వరకు పడటంతో శుక్రవారం అర్థరాత్రి నుంచి అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌ ప్రారంభమైంది. ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా వడ్డీరేట్లను పెంచిన నేపథ్యంలో ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొలగించే అవకాశాలున్నాయని వార్తలు వెలువడ్డాయి. మరోవైపు ఆర్థిక వృద్ధి మందగమనం వార్తలతో పాటు అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు కనిపించకోవడం ఇన్వెస్టర్లు రక్షణాత్మకంగా పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపారు. అమెరికాలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో నేడు ఆసియా మార్కెట్ల మిశ్రమ ట్రేడింగ్‌ సైతం సెంటిమెంట్‌ను బలపరిచింది. ఈ అంశాలన్ని పసిడి ధరకు దన్నుగా నిలవడంతో నేటి ఆసియా ట్రేడింగ్‌లో ఉదయం గం.9:45ని.లకు 9డాలర్లు ర్యాలీ చేసి 1,267.60 వద్ద ఇంట్రాడే వద్ద ట్రేడ్‌ అవుతోంది. గతవారం శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లో పసిడి ధర 6నెలల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో 1,258.95 డాలర్ల వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.

దేశీయంగానూ లాభాల్లోనే:-
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయ మార్కెట్లో పసిడి ధర ర్యాలీ చేస్తుంది. డాలర్‌ మారకంలో రూపాయి పతనం పసిడికి కలిసొస్తుంది. నేడు ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ.225.00లు లాభపడి రూ.31418.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ఈ రెండు షేర్లు కొనచ్చు

Monday 24th December 2018

ఓల్టాస్‌        కొనొచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: బొనంజా పోర్ట్‌ఫోలియో  ప్రస్తుత ధర: రూ.570 టార్గెట్‌ ధర: రూ.708 ఎందుకంటే: టాటా గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీ మూడు విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. యూసీపీ (యూనిటరీ కూలింగ్‌ ప్రొడక్ట్స్‌), ఎలక్ట్రో మెకానికల్‌ ప్రాజెక్ట్స్‌ అండ్‌ సర్వీసెస్‌(ఈఎమ్‌పీఎస్‌), ఇంజినీరింగ్‌ ప్రొడక్ట్స్‌ అండ్‌ సర్వీసెస్‌ (ఈపీఎస్‌) విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వాతావరణ పరిస్థితులు బాగా లేకపోవడం, వరదల కారణంగా కేరళలో ఓనమ్‌ పండుగ అమ్మకాలు బాగా దెబ్బతినడంతో యూసీపీ సెగ్మెంట్‌

పంచదార మిల్లులకు అదనంగా రూ.7,400 కోట్లు?

Monday 24th December 2018

న్యూఢిల్లీ: దేశంలో ఇథనాల్‌ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంలో భాగంగా చక్కెర మిల్లులకు రూ.7,400 కోట్ల మేర సులభ రుణాలు ఇచ్చే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. మొలాసెస్‌ ఆధారితం కాని డిస్టిలరీలకు సైతం రుణాలు ఇవ్వాలన్నది కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ప్రతిపాదన. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఓ పథకంలో భాగంగా చక్కెర మిల్లులకు ఐదేళ్ల కాలంలో రూ.4,400 కోట్ల సులభ రుణాలను, రూ.1,332 కోట్ల వడ్డీ రాయితీతో అందించాలని

Most from this category