STOCKS

News


స్వల్పంగా పెరిగిన పసిడి

Monday 14th January 2019
Markets_main1547445585.png-23566

ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు మద్దతునిస్తున్నాయి. ఫలితంగా ఆసియా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 2.50డాలర్లు పెరిగి 1,292.15 వద్ద ట్రేడ్‌ అవుతుంది. చైనా విడుదల చేసిన డిసెంబర్‌ ఎగుమతి, దిగుమతి గణాంకాలు రెండేళ్ల కనిష్టస్థాయిలో నమోదు కావడం, ముడిచమురు ధరల పెరగుదల, అమెరికా షట్‌డౌన్‌ 23వరోజూ కొనసాగుతుండటం తదితర కారణాలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో అస్థిరత పరిస్థితులను నెలకొల్పాయి. మరోవైపు ఈ ఏడాదిలో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను పెంచకపోవచ్చనే అంచనాలు డాలర్‌ ఇండెక్స్‌పై ఒత్తిడిని కలిస్తున్నాయి. ఈ అంశం సైతం పసిడి ర్యాలీకి తోడ్పాటును అందిస్తుంది. నేడు ఆసియా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర ఒకానొక దశలో 3.50డాలర్లు ర్యాలీ చేసి 1,292.95 డాలర్లు వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.
దేశీయంగానూ పెరుగుదలే:-
దేశీయంగానూ పసిడి ధర ర్యాలీ కొనసాగుతుంది. డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత అందుకు కారణమవుతోంది. ఎంసీక్స్‌ మార్కెట్లో ఉదయం గం.11:00లకు ఔన్స్‌ పసిడి ధర రూ.174.00లు లాభపడి రూ.32102.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఒపెక్‌, రష్యా దేశాలతో అమెరికా సైతం చమురు ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురుకు డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా దేశీయ మార్కెట్లో రూపాయి బలహీనపడుతుంది.



You may be interested

ఒక పెట్టుబడి రెండు ప్రయోజనాలు

Monday 14th January 2019

- పన్ను ఆదా కోసం చివరి నెలల్లో యోచన తగదు - ముందస్తు ప్రణాళికతో రెండిందాలా లాభం - పన్ను, ఆదాయాల పరంగా ప్రయోజనం - ఈక్విటీ అనుసంధాన పథకాలతోపాటు అందుబాటులో పలు సాధనాలు - దీర్ఘకాలిక వ్యూహంతోనే ఆర్థిక లక్ష్యాల సాధన శివరామ్‌ ఉద్యోగంలో చేరిన కొత్తలో... పదేళ్ల క్రితం సంప్రదాయ జీవిత బీమా పాలసీ తీసుకున్నాడు. ఏటా ప్రీమియం రూపంలో రూ.40,000 వేల వరకు చెల్లిస్తు‍న్నాడు. ఇటీవల గృహ రుణం తీసుకోవడంతో... జీవిత బీమా పాలసీ ప్రీమియం చెల్లించడం

బ్రేకవుట్‌ సంకేతాలివే!

Monday 14th January 2019

50, 100 డీఎంఏ మధ్య తగ్గుతున్న అంతరం సూచీలు కొన్ని వారాలుగా స్వల్ప శ్రేణిలో కదలాడుతున్నాయి. నిఫ్టీ బ్రేకవుట్‌ ఇస్తుందా, బ్రేక్‌డవున్‌ అవుతుందా? ఇతమిద్దంగా తెలియక ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిఫ్టీ క్రమంగా బ్రేకవుట్‌కు దగ్గరవుతోందని, ఇందుకు సంకేతాలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చార్టుల్లో 50, 100 రోజుల మూవింగ్‌ యావరేజ్‌ల(డీఎంఏ) మధ్య బేధం తగ్గుతూ వస్తోందని, ఇది చాలా కీలక సంకేతమని చెబుతున్నారు. గత

Most from this category