STOCKS

News


స్వల్పంగా పెరిగిన పసిడి ధర

Monday 15th October 2018
Markets_main1539580732.png-21147

ఆసియా మార్కెట్లు నష్టాల ట్రేడింగ్ నేపథ్యంలో సోమవారం పసిడి ధర స్వల్పంగా లాభపడింది. భారత వర్తమాన కాల ప్రకారం ఉదయం గం.10:15ని.కు ఆసియా మార్కెట్లో ఔన్స్‌ పసిడి 3.40డాలర్లు లాభపడి 1,225.40 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రపంచదేశాల మధ్య వాణిజ్యయుద్దం కొనసాగుతుండం, వడ్డీరేట్ల పెంపుపై యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ సానుకూల ధోరణితో  ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ నేడు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు బ్రెగ్జిట్‌ ఆందోళనలు, యూరో పతనంతో డాలర్‌ ఇండెక్స్‌ కూడా గతవారంలో కోల్పోయిన 95 స్థాయిని అందుకుంది. నేడు డాలర్‌ ఇండెక్స్‌ 0.08శాతం పెరిగి 95.02 స్థాయి వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ కారణాలతో పసిడి ఫ్యూచర్లలో కొనుగోళ్లు పెరిగాయి. ప్రపంచ మార్కెట్లు తిరిగి పుంజుకోవడం పాటు డాలర్‌ ఇండెక్స్‌ బలపడటంతో శుక్రవారం రాత్రి అమెరికా పసిడి ధర 5.90 డాలర్లు నష్టపోయి 1,222 డాలర్ల వద్ద ముగిసింది.
దేశీయంగానూ పెరుగుదలే:-
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయంగానూ పసిడి ధర పెరిగింది. నేటి ఫారెక్స్‌ మార్కెట్‌ డాలర్‌ మారకంలో రూపాయి 74స్థాయి వద్ద క్షీణించడంతో కూడా పసిడి పెరుగుదలకు కారణమైంది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ.112.00లు లాభపడి రూ.31958.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. శుక్రవారం రాత్రి ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి రికవరీ కారణంగా ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ.151లు నష్టపోయి రూ.31840.00ల వద్ద ముగిసింది.



You may be interested

స్వల్ప, దీర్ఘకాల లక్ష్యాల కోసం... ఫ్రాంక్లిన్‌ ఇండియా అల్ట్రా షార్ట్‌ బాండ్‌ ఫండ్‌

Monday 15th October 2018

పెట్టుబడులపై రిస్క్‌కు భయపడేవారు, డెట్‌ సాధనాల్లోనూ కాస్తంత సురక్షితమైన సాధనం కోసం చూసే వారు ఫ్రాంక్లిన్‌ ఇండియా అల్ట్రా షార్ట్‌ బాండ్‌ ఫండ్‌ - సూపర్‌ ఇనిస్టిట్యూషనల్‌ ప్లాన్‌ను పరిశీలించొచ్చు. అధిక రేటింగ్‌ కలిగిన షార్ట్‌ టర్మ్‌ డెట్‌ ఇనుస్ట్రుమెంట్లలో పెట్టుబడులు పెడుతుంది. మనీ మార్కెట్‌ ఇనుస్ర్టుమెంట్లు, కమర్షియల్‌ పేపర్లు పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ వాటాను ఆక్రమిస్తాయి. ఈ కేటగిరీలో గత పదేళ్ల కాలంలో టాప్‌ పథకాల్లో ఇదీ ఒకటిగా నిలిచింది.

రూపీ క్షీణత

Monday 15th October 2018

ఇండియన్‌ రూపాయి సోమవారం మళ్లీ బలహీనపడింది. ఆసియా కరెన్సీలు నష్టాల్లో ట్రేడవుతుండటం, క్రూడ్‌ ధరలు పెరగడం వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయి. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.91 వద్ద ట్రేడవుతోంది. రూపాయి తన శుక్రవారం ముగింపు 73.57తో పోలిస్తే 0.41 శాతం నష్టపోయింది. రూపాయి సోమవారం 73.80 వద్ద ప్రారంభమైంది.   రిటైల్‌ ద్రవ్యోల్బణం అంచనాల కన్నా తక్కువగా పెరడగం వల్ల బాండ్‌ ఈల్డ్స్‌

Most from this category