STOCKS

News


ఫ్లాట్‌గా పసిడి ధర

Friday 30th November 2018
Markets_main1543554014.png-22502

డాలర్‌ స్థిరమైన ర్యాలీ కారణంగా శుక్రవారం పసిడి ధర ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి 0.30డాలర్ల స్వల్ప నష్టంతో  1,230.10 డాలర్ల వద్ద ట్రేడ్‌ కదులుతోంది. అర్జెంటీనాలో నేడు, రేపు జరగనున్న జీ-20 సదస్సులో వాణిజ్య యుద్ధంపై అగ్రరాజ్యాధిపతులైన ట్రంప్‌- జిన్‌పింగ్ మధ్య జరిగే చర్చల ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టిని సారించనున్నారు. దీంతో పసిడిపై ప్రభావాన్ని చూపే డాలర్‌ ఇండెక్స్‌ 96.79 వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో పలు మార్కెట్ల మిశ్రమ ట్రేడింగ్‌ కూడా పసిడి ధరపై ప్రభావాన్ని చూపుతుంది. డిసెంబర్‌ వడ్డీరేట్లపై పెంపు ఉండకపోవచ్చనే అంచనాలతో గురువారం రాత్రి కూడా అమెరికా మార్కెట్లో డాలర్‌ నీరసంగా ట్రేడైంది. ఫలితం అక్కడి మార్కెట్లో పసిడి ధర 1 డాలర్‌ లాభపడి 1,230.40 వద్ద ముగిసింది.
దేశీయంగానూ స్వల్ప నష్టాలు:-
దేశీయంగా పసిడి ధర స్వల్పంగా నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. రూపాయి ర్యాలీ అందుకు కారణమవుతోంది. ఉదయం గం.10:15ని.లకు ఎంసీఎక్స్‌లో డిసెంబర్‌ ఫ్యూచర్‌ 10గ్రాముల పసిడి ధర రూ.20లు నష్టపోయి రూ.30185.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫారెక్స్‌ మార్కెట్లో గురువారం ఒకేరోజు 77 పైసలు బలపడటంతో ఎంసీక్స్‌లో ఔన్స్‌ పసిడి ధర రూ.229లు నష్టపోయి రూ.30205ల వద్ద ముగిసింది.



You may be interested

వాస్తవ ఆర్థిక స్థితిని తెలిపేందుకే..!

Friday 30th November 2018

న్యూఢిల్లీ: మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో వృద్ధి రేటును సవరించడాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ సమర్థించారు. ఎంతో విశ్వసనీయత కలిగిన కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌వో) ఈ పని చేసిందంటూ... ఆర్థిక శాఖకు ఈ విభాగానికి ఉండాల్సినంత దూరం ఉందని గుర్తు చేశారు. గత కాలపు జీడీపీ వృద్ధి రేటు సవరణలపై వస్తున్న విమర్శలకు జైట్లీ స్పందించి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘2011-12

మరింత బలపడిన రూపీ

Friday 30th November 2018

ఇండియన్‌ రూపాయి లాభాల ఇన్నింగ్స్‌ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం కూడా లాభాలతో ప్రారంభమైంది. ఉదయం 9:15 సమయంలో ఇండియన్‌ రూపాయి తన మునపటి ముగింపుతో పోలిస్తే 0.18 శాతం పెరుగుదలతో 69.72 వద్ద ట్రేడవుతోంది. ఆగస్ట్‌ 10 నుంచి చూస్తే ఇదే గరిష్ట స్థాయి. రూపాయి గురువారం ముగింపు స్థాయి 69.85గా ఉంది. కాగా ఇండియన్‌ రూపాయి శుక్రవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 69.69 వద్ద ప్రారంభమైంది. క్రూడ్‌ ధరలు

Most from this category