STOCKS

News


స్వల్పంగా తగ్గిన పసిడి ధర

Thursday 24th January 2019
Markets_main1548312523.png-23779

ఇన్వెస్టర్లు ఈక్విటీల కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో పసిడి ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఆసియా మార్కెట్లో గురువారం ఔన్స్‌ పసిడి ధర 3.50 డాలర్లు తగ్గి 1,280.50 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికాలో పలు కంపెనీలు నాలుగో త్రైమాసిక ఫలితాలను ఆశించిన స్థాయిలో ప్రకటించండతో రాత్రి అమెరికా సూచీలు లాభాలతో  ముగిశాయి. అలాగే చైనా అమెరికా-చైనా దేశాల మద్య వాణిజ్య సంబంధాలపై ఆశావహంతో నేటి ట్రేడింగ్‌లో ఆసియా మార్కెట్లో జపాన్‌ తప్ప అన్ని ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ 95.83డాలర్ల స్థాయికి ర్యాలీ చేయడం సైతం పసిడిపై ధరపై  ఒత్తిడిని పెంచుతుంది. నేటి ఇంట్రాడేలో ఒకానొక దశలో పసిడి ధర 4డాలర్ల నష్టపోయి 1,280.00 డాలర్ల కనిష్టాన్ని తాకింది.
దేశీయంగానూ స్వల్ప తగ్గుదలే:-
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఎంసీక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ.50లు నష్టపోయి రూ.32091.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి 7పైసల లాభంతో ప్రారంభం కావడం దేశీయంగా పసిడిపై ప్రభావాన్ని చూపుతుంది.



You may be interested

ఇండియాపై బుల్లిష్‌

Thursday 24th January 2019

ఆనంద్‌ మహీంద్రా ఐఎంఎఫ్‌ పేర్కొన్నట్లు భారత్‌ బుల్లిష్‌ పిరియడ్‌లో ఉందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌మహీంద్రా అభిప్రాయపడ్డారు. ఇండియా ప్రస్తుత స్థితికి రావడానికి అనేక అవరోధాలను అధిగమించాల్సివచ్చిందని, అనేక నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయాల్సివచ్చిందని చెప్పారు.  గతకొన్నేళ్లుగా ప్రభుత్వాలు తీసుకువచ్చిన సంస్కరణలు ఫలాలను అందిస్తున్నాయని చెప్పారు. ఈ సంస్కరణల ఫలాలను దేశం వినియోగించుకొని దూసుకుపోవాలన్నారు. గతేడాది పండుగ సీజర్‌ అనుకున్నంత జోరుగా లేదని, కానీ రాబోయే నెలల్లో వినియోగం భారీగా పెరుగుతుందని అంచనా

ఆర్‌బీఐ యూటర్న్‌?

Thursday 24th January 2019

రేట్‌కట్‌ దిశగా మొగ్గు చూపవచ్చంటున్న నిపుణులు రాబోయే రోజుల్లో ఆర్‌బీఐ తన పంథాను మార్చుకోవచ్చని రాయిటర్స్‌ పోల్‌లో పాల్గొన్న ఎకానమిస్టులు అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి నెల సమీక్షా సమావేశంలో ఆర్‌బీఐ తన ధృక్పధాన్ని న్యూట్రల్‌గా మార్చవచ్చని, జూన్‌ నుంచి రేట్ల తగ్గింపు మొదలుబెట్టవచ్చని అంచనా వేశారు. ఒక్క నెల్లోనే ఎకానమిస్టుల అంచనాల్లో భారీ తేడా వచ్చింది. వచ్చే త్రైమాసికం నుంచి ఆర్‌బీఐ రేట్లను పెంచుతుందని ఎక్కువమంది ఎకానమిస్టులు గత నెల సర్వేలో అభిప్రాయపడ్డారు.

Most from this category