STOCKS

News


వారం కనిష్టానికి పసిడి

Friday 14th December 2018
Markets_main1544763741.png-22921

ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం వారం కనిష్టస్థాయి వద్ద కదలాడుతోంది. ఆసియాలో ఉదయం గం.10:00లకు ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్ప నష్టంతో 1246.40డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.గత రాత్రి అమెరికా మార్కెట్లో డాలర్‌ బలపడటంతో అక్కడి మార్కెట్లో పసిడి ధర వారం రోజుల కనిష్టానికి తగ్గింది. యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ వచ్చే ఏడాదికాలానికి వృద్ధిరేటును, ద్రవ్యోల్బణ అంచనాలకు తగ్గించడంతో యూరో బలహీనపడింది. ఇది డాలర్‌ బలపడటానికి కారణమైంది. ‘‘ఈసీబీ అధ్యక్షుడు మారికో కీలక వడ్డీరేట్లపై సానుకూల ధోరణి కనబరుస్తున్నారు. ఇది యూరో కరెన్సీ విలువపై ప్రభావాన్ని చూపుతుంది. అలాగే అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధ వాతవరణం క్రమంగా సద్దుమణగడం సైతం పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను తగ్గిస్తుంది.’’అని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలతో పసిడి ధర అక్కడి మార్కెట్లో 5.55 డాలర్లు నష్టపోయి 1,244.45 డాలర్ల  కనిష్టానికి చేరుకుంది. చివరికి 1,247.40 డాలర్ల వద్ద స్ధిరపడింది.
దేశీయంగా స్వల్ప పెరుగుదల:-
డాలర్‌ మారకంలో రూపాయి నష్టాల ప్రారంభంతో దేశీయ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా లాభపడింది. ఉదయం గం.10:10ని.లకు ఎం‍సీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాములు పసిడి గతముగింపు(రూ.31527.00) ధరతో పోలిస్తే రూ.27ల లాభంతో రూ.31554.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇక నిన్నటి ట్రేడింగ్‌లో పసిడి ధర రూ.200లు నష్టపోయింది.

 



You may be interested

రెండు మూడు అంశాల్లో ఆర్‌బీఐతో విభేదాలు

Friday 14th December 2018

ముంబై: రెండు మూడు విషయాల్లో ఆర్‌బీఐతో ప్రభుత్వానికి అంతరాలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అంగీకరించారు. ఆర్‌బీఐ పనితీరుపై చర్చను దెబ్బతీయడంగా ఎలా అభివర్ణిస్తారని జైట్లీ ప్రశ్నించారు. రాజకీయ పరమైన ఒత్తిళ్ల కారణంగానే ఉర్జిత్‌ పటేల్‌ ఆర్‌బీఐ గవర్నర్‌ పదవికి రాజీనామా చేశారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో... గతంలోనూ ప్రభుత్వాలు ఈ తరహా చర్యలు తీసుకున్న ఉదంతాలున్నాయన్నారు. కాంగ్రెస్‌ ప్రధానులు నెహ్రూ, ఇందిరిగాంధీ ఆర్‌బీఐ గవర్నర్లను రాజీనామా

భారత్‌లో గూగుల్ 'షాపింగ్‌'

Friday 14th December 2018

న్యూఢిల్లీ: రిటైలర్లు అందించే ఆఫర్లు, వివిధ ఉత్పత్తుల రేట్లను పోల్చి చూసుకునేందుకు ఉపయోగపడే 'షాపింగ్‌' ఫీచర్‌ను టెక్ దిగ్గజం గూగుల్ భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ‘గూగుల్ షాపింగ్’ హోమ్‌ పేజీలో కొంగొత్త ట్రెండింగ్ ఉత్పత్తులు, డీల్స్‌ మొదలైనవి ఉంటాయని సంస్థ వివరించింది. దేశీయంగా 40 కోట్ల మంది పైగా ఇంటర్నెట్ యూజర్లు ఉన్నప్పటికీ.. వీరిలో మూడింట ఒక వంతు యూజర్లు మాత్రమే ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారని గూగుల్ వైస్ ప్రెసిడెంట్

Most from this category