STOCKS

News


పసిడిలో లాభాల స్వీకరణ

Friday 22nd March 2019
Markets_main1553233544.png-24743

ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో పసిడి ధర ప్రపంచ మార్కెట్లో 3వారాల గరిష్టస్థాయి నుంచి వెనక్కి వచ్చింది. అయితే ఈ ఏడాదిలో కూడా వడ్డీరేట్ల పెంపు ఉండదనే ఫెడ్‌ సంకేతాలు పసిడి మద్దతునిస్తున్నాయి. కీలక వడ్డీరేట్లపై ఫెడ్‌ యధాతధ పాలసీ విధాన ప్రకటన తర్వాత అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్‌ ఏడాది కనిష్టానికి, డాలర్‌ ఇండెక్స్‌ 6వారాల కనిష్టానికి క్షీణించాయి. ఫలితంగా నిన్నటి ట్రేడింగ్‌లో పసిడి ధర 20డాలర్లు లాభపడి 1,320.05 గరిష్టానికి చేరుకుంది. అయితే రాత్రి అమెరికి పసిడి ఫ్యూచర్లలో లాభాల స్వీకరణతో పాటు టెక్‌ షేర్లలో ర్యాలీ కారణంగా అక్కడి ఈక్విటీ మార్కెట్‌ లాభాలతో ట్రేడ్‌ కావడంతో పసిడి ధర 3వారాల గరిష్టస్థాయి నుంచి వెనక్కి వచ్చింది. రాత్రి అక్కడి మార్కెట్లో 1320 డాలర్ల గరిష్టస్థాయి నుంచి ఏకంగా 13 నష్టపోయి 1,307 డాలర్ల వద్ద ముగిసింది. నేడు ఆసియాలో 1,309.05 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఆసియా ట్రేడింగ్‌లో శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో అరడాలరు లాభంతో 1,307.65 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
దేశీయంగా స్వల్ప నష్టం:- 
డాలరు మారకంలో రూపాయి ర్యాలీ కారణంగా దేశీయంగా పసిడి ధర స్వల్ప నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. ఉదయం ట్రేడింగ్‌లో ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ.60.00లు నష్టపోయి రూ.31759.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ తాజాగా యధాతధ పాలసీ అమలును ప్రకటించడంతో ఆరు డాలర్‌ ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ క్షీణించడటం దేశీ కరెన్సీ రూపాయికి కలిసొచ్చింది. ఫలితంగా నేడు ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 19 పైసలు బలపడింది.



You may be interested

ఇండియా మార్కెట్లో మరింత సత్తా ఉంది.. వచ్చేయండి!

Friday 22nd March 2019

విదేశీ ఇన్వెస్టర్లకు క్రిస్‌ఉడ్‌ సలహా భారత ఈక్విటీ మార్కెట్లో వెయిటేజ్‌లు పెంచుకునేందుకు ఇంకా ఎంతో ఛాన్సుందని, అందువల్ల వెనకముందు ఆలోచించక భారత మార్కెట్లో పెట్టుబడులకు తరలిరావాలని విదేశీ ఇన్వెస్టర్లకు ప్రముఖ వ్యూహకర్త క్రిస్‌ఉడ్‌ సలహా ఇచ్చారు. వారం వారం ఆయన వెలువరించే గ్రీడ్‌ అండ్‌ ఫియర్‌ నివేదికలో భారత మార్కెట్‌పై పాజిటివ్‌గా స్పందించారు. ఇటీవల దేశీ మార్కెట్లో ఉన్నట్లుండి ఎఫ్‌ఐఐల ప్రవాహం పెరగడంపై స్పందిస్తూ సుస్థిర ప్రభుత్వంపై ఆశలే ఇందుకు కారణమన్నారు.

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 22nd March 2019

వివిధ వార్తల‌కు అనుగుణంగా శుక్రవారం ప్రభావిత‌య్యే షేర్ల వివ‌రాలు ది ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా:‍ ‍‍‍- కంపెనీ  అనుబంధ సంస్థ  ఐటిఐ రీ ఇన్స్యూరెన్స్ లిమిటెడ్ త‌న షేరు హోల్డర్ల నుంచి రూ.10లు ముఖ విలువ క‌లిగిన 5.43ల‌క్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది.  మైండ్ ట్రీ:- షేర్ల బై బ్యాక్ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. ఈ నెల 26న మరోసారి బోర్డు సమావేశాన్ని జరపనున్నట్లు కంపెనీ అధికారులు ప్రకటించారు.   పిర‌మిల్

Most from this category