News


స్థిరంగా పసిడి

Friday 28th December 2018
Markets_main1545975665.png-23284

ఆర్థిక మందగమన భయాల నేపథ్యంలో ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి 1డాలరు స్వల్ప నష్టంతో 1,279.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అయితే నేడు ఆసియాలో పలు ఈక్విటీ మార్కెట్లలో జరుగుతున్న ర్యాలీ పసిడి ధరకు ప్రతికూలంగా మారనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక గత ట్రేడింగ్‌లో పసిడి ధర 8డాలర్ల వరకూ ర్యాలీ చేసింది. డాలర్‌ బలహీనత, ప్రపంచమార్కెట్లో రికవరీ కారణంగా ఇన్వెస్టర్లు పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితం రాత్రి అమెరికా మార్కెట్లో 8 డాలర్లు లాభపడి 1,281.10 వద్ద ముగిసింది.
రూపాయి ర్యాలీ- నష్టాల్లో పసిడి ధర:-
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ర్యాలీ చేస్తున్నప్పటికీ, దేశీయంగా బులియన్‌ మార్కెట్లో మాత్రం నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ మారకంలో రూపాయి ర్యాలీ పసిడి ధరకు అడ్డుకట్ట వేస్తుంది. నేడు ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి 20పైసలు బలపడటంతో ఎంసీక్స్‌ మార్కెట్లో పసిడి ధర నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. ఎంసీఎక్స్‌లో  ఉదయం గం.10:30లకు 10గ్రాములు పసిడి ధర రూ.88 నష్టంతో రూ.31625.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  ఇక నిన్నటి ట్రేడింగ్‌ విషయానికొస్తే... నిన్న రాత్రి ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 29 పైసలు నష్టపోవడంతో పసిడి ధర రూ.154లు లాభపడి రూ.31713 వద్ద ముగిసింది.



You may be interested

వచ్చే ఏడాది కూడా మనమే బెస్ట్‌!

Friday 28th December 2018

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనా ఈ ఏడాది ఇతర దేశాల ఈక్విటీలతో పోలిస్తే మన మార్కెట్లు మంచి ప్రదర్శనే నమోదు చేశాయని, ఇదే జోరు కొత్త ఏడాది కూడా కొనసాగుతుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ప్రతినిధి వీకే శర్మ అభిప్రాయపడ్డారు. యూఎస్‌ మార్కెట్లు ఉన్నట్లుండి బేర్‌ జోన్‌లోకి వచ్చాయని, దీంతో అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్‌కావచ్చని చెప్పారు. బ్యాంకింగ్‌ బాగోగులపై యూఎస్‌ ప్రభుత్వం కన్ను సారించిందన్న వార్తలతో అమెరికా మార్కెట్లు భారీగా పతనమయింది. ఈ

ఆ రెండు అంశాలే డిసైడ్‌ చేస్తాయి!

Friday 28th December 2018

మార్కెట్‌పై ఆనంద్‌ రాఠీ అంచనా రాబోయే కాలంలో దేశీయ మార్కెట్లను మూడో త్రైమాసిక ఫలితాలు, బడ్జెట్‌లో ప్రభుత్వ చర్యలు ప్రభావితం చేస్తాయని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ ఆనంద్‌ రాఠీ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. ఈ ఏడాది చివరకు చమురు ధరలు శాంతించడం, బ్యాంకుల రీక్యాపిటలైజెషన్ వార్తలు మార్కెట్లను ఆదుకున్నాయని తెలిపింది. ఒక దశలో యూఎస్‌ ప్రభుత్వ షట్‌డౌన్‌, ఫెడ్‌ రేట్ల పెంపు తదితర అంశాలు సూచీలను తీవ్ర నెగిటివ్‌ జోన్‌లోకి నెట్టాయని

Most from this category