STOCKS

News


స్థిరంగా పసిడి ధర

Wednesday 26th September 2018
Markets_main1537937960.png-20573

ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ సమీక్షా సమావేశాల నేపథ్యంలో బుధవారం పసిడి స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా మార్కెట్లో భారత వర్తమానకాలం ఉదయం 10 గంటలకు ఔన్స్‌ పసిడి 1 డాలరు స్వల్పంగా లాభపడి 1,206 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్న, నేడు (సెప్టెంబర్‌ 25, 26 తేదిల్లో) ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్యపరపతి సమీక్షా సమావేశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌(94.143) నిలకడగా ట్రేడ్‌ అవుతుండటం కూడా పసిడి స్థిరమైన ర్యాలీకి కారణమవుతోంది. ‘‘మార్కెట్‌ వర్గాలు ఊహించినట్లుగా ఫెడ్‌ కీలకవడ్డీ రేట్లను పెంచినట్లైతే డాలర్‌ విలువ పుంజుకుంటుంది. ఫలితంగా ప్రస్తుతం పసిడికి కీలక మద్దతు ధరగా ఉన్న 1200 డాలర్ల స్థాయి కోల్పోతుంది. ఈ తరువాత 1,194 డాలర్ల వద్ద కీలక అవరోధం ఏర్పడవచ్చు’’ అని ఏపీటీసీ ట్రేడింగ్‌ హెడ్‌ స్టీఫెన్‌ అంటున్నారు. మంగళవారం రాత్రి  అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిం‍పు కారణంగా అక్కడ ఔన్స్‌ పసిడి 1,205 డాలర్ల వద్ద ముగిసింది.
దేశీయంగానూ స్థిరంగానే:-
ఇక దేశీయంగానూ పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఎంసీఎక్స్‌లో బుధవారం 10గ్రాముల పసిడి రూ.20.00లు స్వల్పంగా నష్టపోయి రూ.30790.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి స్థిరమైన ర్యాలీ, దేశీయంగా డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతుండటం ఇందుకు కారణమవుతున్నాయి. మంగళవారం రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగింపు సమయానికి 10గ్రాముల పసిడి రూ.50లు లాభపడి రూ.30810 వద్ద ముగిసింది.



You may be interested

త్వరలో ‘ఫ్లెయిర్‌’ ఐపీఓ

Wednesday 26th September 2018

న్యూఢిల్లీ: పెన్నులు తయారు చేసే ఫ్లెయిర్‌ రైటింగ్‌ ఇండస్ట్రీస్‌ త్వరలో ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) వస్తోంది. ఐపీఓ ముసాయిదా పత్రాలను ఈ కంపెనీ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి ఇటీవలే సమర్పించింది. ఈ ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ రూ.330 కోట్లు విలువ గల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. అంతేకాకుండా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) మార్గంలో షేర్లు జారీ చేసి రూ.120 కోట్లు సమీకరించనుంది.

బుధవారం వార్తలోని షేర్లు

Wednesday 26th September 2018

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా:- రేటింగ్‌ సంస్థ మూడీస్‌ బ్యాంక్‌ అవుట్‌లుక్‌ రేటింగ్‌ను స్థిరత్వానికి సవరించింది. కల్లాం టెక్స్‌టైల్స్‌:- రెట్స్‌ ఇష్యూ అంశంపై చర్చించేందుకు సెప్టెంబర్‌ 29న బోర్డు సమావేశం నిర్వహించనుంది. అవెన్యూ సూపర్‌మార్ట్స్‌:- కంపెనీ రూ.65కోట్ల విలువైన కమర్షియల్‌ పేపర్ల ఇష్యూను జారీ చేసింది. అలాగే రేటింగ్‌ సంస్థ క్రిసెల్‌ కంపెనీకి గల బ్యాంక్‌ ధీర్ఘకాలిక రుణ సదుపాయాలకీ, ఎన్‌డీలకు రేటింగ్‌ను ఎఎ(+)స్థిరత్వానికి పెంచింది. సెంట్రల్‌

Most from this category