STOCKS

News


స్థిరంగా పసిడి ధర

Wednesday 14th November 2018
Markets_main1542171741.png-21969

ప్రపంచమార్కెట్లో పసిడి ధర బుధవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా మార్కెట్లో భారత వర్తమానకాల ప్రకారం ఉదయం గం.10:00లకు ఔన్స్‌ పసిడి ధర 1.20డాలర్లు స్వల్పంగా పెరిగి 1203 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గతరాత్రి అమెరికా మార్కెట్ల నష్టాల ముగింపు ప్రభావంతో నేడు ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లు, అమ్మకాలపై ఆచూతూచి వ్యవహరిస్తున్నారు. మరోవైపు పసిడి ధరపై ప్రభావాన్ని చూపే డాలర్‌ ఇండెక్స్‌ 96.98 వద్ద స్థిరమైన కదలిక కూడా పసిడి ధరపై ప్రభావాన్ని చూపుతుంది. రాత్రి అమెరికా మార్కెట్‌ నష్టాల ముగింపు కారణంగా అక్కడి మార్కెట్లో ఔన్స్‌ పసిడి 1,201.40 డాలర్ల వద్ద ముగిసింది.
రెండో రోజూ నష్టాల్లోనే:-
ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 2నెలల గరిష్ట స్థాయికి చేరుకోవడంతో దేశీయ ఎంసీక్స్‌ మార్కెట్లో పసిడి ధర వరుసగా రెండో రోజూ నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. నేడు ఎంసీక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ.30,704.00ల వద్ద ప్రారంభమైంది. ఉదయం గం.10.30లకు గత ముగింపు ధర(రూ.30769)తో పోలిస్తే 81శాతం నష్టంతో రూ. 30688.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

10,600 దిగువన నిఫ్టీ

Wednesday 14th November 2018

లాభాలతో ప్రారంభమైన ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు గంట తర్వాత యూటర్న్‌ తీసుకున్నాయి. రూపాయ రికవరీ కారణంగా ఐటీ ఇండెక్స్‌ బాగా పడిపోవడంతో బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు నష్టా‍ల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 10:23 సమయంలో సెన్సెక్స్‌ 83 పాయింట్ల నష్టంతో 35,061 వద్ద, నిఫ్టీ 18 పాయింట్ల నష్టంతో 10,564 వద్ద ట్రేడవుతున్నాయి.  నిఫ్టీ-50లో హిందుస్తాన్‌ పెట్రోలియం 9 శాతానికి పైగా ఎగసింది. బీపీసీఎల్‌, ఐఓసీ షేరు​7 శాతానికి పైగా పెరిగాయి. ఏసియన్‌ పెయింట్స్‌

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 14th November 2018

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఇవి జీఎంటర్‌టైన్‌మెంట్‌:- కంపెనీ ప్రమోటర్‌ గ్రూప్‌ 50శాతం వాటాను కంపెనీ వ్యూహాత్మక భాగస్వామికి విక్రయించారు. జెట్‌ ఎయిర్‌వేస్‌:- కంపెనీని టాటాగ్రూప్‌ కొనుగోలు చేస్తుందనే వార్తలను ఖండించింది. హిందాల్కో:- బ్రెజిల్‌లో అల్యూమినియం ఉత్పత్తితో పాటు రిసైక్లింగ్‌ ఉత్పాదకతను పెంచేందుకు తన అనుబంధ సంస్థ ‘‘నావిలస్‌’’ రూ.1200 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. వాల్‌చంద్‌నగర్‌ ఇండస్ట్రీస్‌:- రూ.200 కోట్లకు మించకుండా సెక్యూరిటీల జారీ చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇన్ఫోసిస్‌:- టెక్సాస్‌లో

Most from this category