STOCKS

News


పసిడికి పావెల్‌ బూస్ట్‌

Thursday 11th July 2019
Markets_main1562819834.png-26966

వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో పాటు డాలర్‌ ఇండెక్స్‌ బలహీనతతో పసిడి ధర తిరిగి లాభాల బాట పట్టింది. నిన్నరాత్రి అమెరికా మార్కెట్లో వారం రోజుల గరిష్టాన్ని అందుకున్న పసిడి ధర గురురం ట్రేడింగ్‌లో మరో 15డాలర్లు అందుకుంది. నిన్న అమెరికా కాం‍గ్రెస్‌ ఎదుట ప్రసగించిన ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ వడ్డీరేట్ల తగ్గింపునుకు మద్ధతుగా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ నెలాఖరున చేపట్టనున్న పాలసీ సమీక్షలో ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయాలు ప్రకటించవచ్చన్న అంచనాలు తాజాగా బలపడ్డాయి. నిన్న రాత్రి అమెరికా మార్కెట్లో ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ పతనం జరగడంతో పాటు, పసిడి ఫ్యూచర్లకు భారీగా డిమాండ్‌ పెరిగింది. మార్కెట్‌ ముగింపు సమయానికి అక్కడి మార్కెట్లో ఔన్స్‌ పసడి ధర 12డాలర్లు పెరిగి 1,412.50 డాలర్ల వద్ద స్థిరపడింది. నేటి ఆసియాలో కూడా అదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ 15డాలర్లు లాభపడి 1,428.95డాలర్ల గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.9:45ని.లకు ఔన్స్‌ పసిడి ధర 13.60డాలర్లు పెరిగి 1,426.10 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
దేశీయంగా రూ.200లు పెరుగుదల:- 
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ర్యాలీ చేయడంతో దేశీయంగానూ పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ పెరిగింది. ఆగస్టు ఫ్యూచర్‌ కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ధర నేటి ట్రేడింగ్లో రూ.200లు లాభపడి రూ.35039.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్న ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి బలహీనత కారణంగా పసిడి రూ.34839ల వద్ద స్థిరపడింది.



You may be interested

28 పైసలు బలపడిన రూపీ

Thursday 11th July 2019

 ఫెడ్‌ వడ్డి రేట్ల కోత ఉండవచ్చనే నేపథ్యంలో రూపీ డాలర్‌ మారకంలో 28 పైసలు బలపడి 68.30 వద్ద గురువారం(జులై 11) ప్రారంభమైంది. బంగారం ధరలు పెరగడంతో డాలర్‌ బలహీనపడుతోంది. గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 68.58 వద్ద ముగిసింది. 

నెల గరిష్ఠానికి చమురు

Thursday 11th July 2019

గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోలో హరికేన్‌ పొం‍చి ఉండడంతో చమురు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీనితో పాటు బ్రిటిష్‌ ఆయిల్‌ ట్యాంకర్‌ మధ్యప్రాచ్యంలో చిక్కుకోవడంతో గురువారం(జులై 11) ట్రేడింగ్‌లో డబ్యూటీఐ క్రూడ్‌ 11సెంట్‌లు పెరిగి బ్యారెల్‌కు 66.54 డాలర్ల వద్ద, బ్రెంట్‌ క్రూడ్‌ 5 సెంట్లు పెరిగా బ్యారెల్‌కు 66.96 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఇరాన్‌ బ్రిటన్‌ ఆయిల్‌ ట్యాంకర్‌ను బుధవారం నిలిపివేయడంతో మధ్యప్రాచ్యంలో ఒత్తిళ్లు పెరిగాయి. ఫలితంగా బుధవారం ఆయిల్‌

Most from this category