STOCKS

News


పెరుగుతున్న పసిడి

Friday 16th August 2019
Markets_main1565932067.png-27800

అమెరికా-చైనాల వాణిజ్య ఒప్పందంపై కొనసాగుతున్న అనిశ్చితి కారణంగా  ప్రపంచమార్కెట్లో శుక్రవారం పసిడి ధరలు ర్యాలీ చేస్తున్నాయి. ఆసియాలో ఔన్స్‌ పసిడి నేడు 7డాలర్లు పెరిగి 1,538 డాలర్లకు చేరుకుంది. అమెరికా - చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుండటంతో అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి మొదలైంది. ఫలితంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను రక్షణాత్మక సాధనాలైన బాండ్లు, పసిడి ఫ్యూచర్లలో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. అమెరికా జూలై మాసపు రీటైల్‌ అమ్మకాల గణాంకాలు అంచనాలకు మించిన నమోదైనప్పటికీ అవి బాండ్ల ర్యాలీపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయాయి. ఈవారం రోజుల్లో 30 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌ 27బేసిస్‌ పాయింట్లు పతనమవడంతో పాటు ఆల్‌టైం కనిష్టానికి చేరుకుంది. తమదేశానికి చెందిన 300డాలర్ల దిగుమతులపై అమెరికా విధించబోయే 10శాతం అదనపు పన్ను విధింపు వెనక్కి తగ్గకపోతే ప్రతీకార చర్యలు తప్పవని చైనా హెచ్చరించింది. అలాగే ఇన్వెస్టర్లు వచ్చేవారంలో జరగబోయే ఫెడరల్‌ రిజర్వ్‌ వార్షిక సదస్సుపై దృష్టిని సారించారు. సెప్టెంబర్‌లో ఫెడరల్‌ రిజర్వ్‌బ్యాంక్‌ వడ్డీరేట్లపై తగ్గింపు​ 50 బేసిస్‌ పాయింట్లు ఉండవచ్చని ప్రతి ముగ్గరు ట్రేడర్లలో ఒకరు భావిస్తున్నారు. ఇదే సెప్టెంబర్‌లో యూరోపియన్‌ యూనియన్‌ బ్యాంక్‌ కూడా వడ్డీరేట్లపై 10శాతం కోత విధింపు ఉండవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనావేస్తున్నారు. ఇక పసిడి ధరలపై వ్యతిరేక ప్రభాన్ని చూపే డాలర్‌ ఇండెక్స్‌ రివకరీ దిశగా సాగుతోంది. గతవారంలో 3వారాల కనిష్టస్థాయి నుంచి నేటి వరకు 1.1శాతం పెరిగింది. 
దేశీయంగానే స్థిరంగా పసిడి ధరలు:-
ఇక దేశీయంగా పసిడి ధరలు గరిష్టస్థాయి వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతున్నాయి. నేడు ఎంసీఎక్స్‌లో 10గ్రాముల పసిడి ధర రూ.38,143.00 వద్ద ప్రారంభమైంది. ఉదయం గం.10:15 లకు రూ.13లు స్వల్ప నష్టంతో రూ.38150 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా సెలవు. బుధవారం 10గ్రాముల పసిడి ధర రూ.388లు లాభపడి రూ.38163 వద్ద స్థిరపడింది. 



You may be interested

అస్తవ్యస్తం.. ఆటో రంగం

Friday 16th August 2019

అమ్మకాలు లేక ఉత్పత్తి తగ్గించుకుంటున్న కంపెనీలు దీంతో ఉద్యోగాల్లో కూడా కోత ఇప్పటికే 3.5 లక్షల ఉద్యోగాలు కట్‌ తాత్కాలిక సిబ్బందికి మరింత కష్టకాలం సేల్స్‌, ఆర్‌అండ్‌డీలో ఉద్యోగాలకు ఎసరు ముంబై: వాహన విక్రయాలు నానాటికి తగ్గిపోతుండటంతో ఆటోమొబైల్ రంగం తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లో కూరుకుపోతోంది. జూలైలో అమ్మకాలు దాదాపు రెండు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీంతో వాహన తయారీ సంస్థలు ఉత్పత్తిని తగ్గించేసుకుంటున్నాయి. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూలై

డాలర్‌ డిమాండ్‌..తగ్గిన రూపీ విలువ

Friday 16th August 2019

బ్యాంకులు, దిగుమతిదారుల కొనుగోలు వలన యుఎస్‌ కరెన్సీకి డిమాండ్‌ పెరగడంతో దేశియ కరెన్సీ రూపీ డాలర్‌ మారకంలో  శుక్రవారం 10 పైసలు బలహీనపడి 71.37 వద్ద ప్రారంభమైంది. దీనితో పాటు పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ గత సెషన్లో 6.58 శాతానికి తగ్గింది. ఇది అంతకుముందు ట్రేడింగ్ సెషన్లో 6.62 శాతంగా ఉండడం గమనార్హం. యుఎస్ రిటైల్ అమ్మకాల పెరగడంతో డాలర్‌ బలపడుతోంది. ఈ రోజు, రూపీ డాలర్‌ మారకంలో 71.10-

Most from this category