News


డాలర్‌ పతనంతో పసిడి వెలుగులు

Friday 11th January 2019
Markets_main1547186903.png-23519

ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం 6 డాలర్లు లాభపడింది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత పసిడికి ర్యాలీకి తోడ్పాటు అందిస్తుంది.  ఆసియా మార్కెట్లో గురువారం ఉదయం గం.10:00ని.లకు ఔన్స్‌ పసిడి ధర 6డాలర్లు లాభపడి 1,293 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ ఏడాది అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేట్లను పెంచకపోవచ్చనే అంచనాలతో డాలర్‌ బలహీనపడింది. బలహీనపడి డాలర్‌, వడ్డీరేట్లపై ఫెడ్‌ మెతక వైఖరీ పసిడికి ర్యాలీకి ప్రధాన కారణాలని చెప్పవచ్చు. ఈ ఏడాది చివరి లేదా వచ్చే ఏడాది వరకు అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమ ఆందోళనలు కొనసాగవచ్చు. కాబట్టి ఫెడ్‌ వడ్డీరేట్లను పెంచవచ్చని మార్కెట్ల వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ ‘‘ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్య విధానంపై కఠిన వైఖరి ఇప్పట్లో  ఉండదు’’ అని వ్యాఖ్యానించడంతో డాలర్‌ ఇండెక్స్‌ మూడు నెలల కనిష్టానికి చేరుకుంది. అలాగే అమెరికా ప్రభుత్వ పాక్షిక స్తంభన 20వ రోజుకు చేరుకోడం ఇన్వెస్టర్లను రక్షణాత్మక ధోరణి భావించే పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు పురిగొల్పుతుంది.
రూ.32000 దిగువకు పసిడి ధర:-
గత ట్రేడింగ్‌లో రూ.32000ల స్థాయిని అందుకున్న పసిడి ధర శుక్రవారం ట్రేడింగ్‌లో ఆ స్థాయిని చేజార్చుకుంది. డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం పసిడికి ప్రతికూలాంశంగా మారింది. ఎంసీఎక్స్‌లో నేటి ఉదయం గం.10:15ని.లకు ఫిబ్రవరి కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.15లు స్వల్పనష్టంతో రూ.31965.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

చిన్న వ్యాపారులకు భారీ ఊరట

Friday 11th January 2019

రూ.40 లక్షల టర్నోవర్‌పై జీఎస్టీ లేదిక మినహాయింపు పరిమితి రెట్టింపు కేరళ చేతికి ఒక శాతం విపత్తు సెస్సు రూ.1.5 కోట్ల టర్నోవర్‌పై ఒక శాతమే పన్ను వచ్చే ఏప్రిల్‌ నుంచి అమల్లోకి జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయాలు న్యూఢిల్లీ: చిన్న వ్యాపారులకు ఊరట కల్పిస్తూ జీఎస్టీ కౌన్సిల్‌ గురువారం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకు రూ.20 లక్షల వరకు వార్షిక వ్యాపారంపై జీఎస్టీ మినహాయింపు ఉండగా... దీన్ని రెట్టింపు చేస్తూ రూ.40 లక్షలకు పెంచింది. దీనికితోడు ఒక

కలిసిరాని ఫలితాలు...టీసీఎస్‌ 2 శాతం డౌన్‌

Friday 11th January 2019

2శాతం నష్టపోయిన షేరు దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసిక ఫలితాలు ఆ కంపెనీ షేరుకు కలిసిరాలేదు. ఫలితంగా శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఈ కంపెనీ షేరు ఏకంగా 2శాతం నష్టపోయింది. ఈ క్యూ3లో టీసీఎస్‌ లాభాల పంటపండిచినప్పటీకి కంపెనీ షేరు మాత్రం నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేడు ఎన్‌ఎస్‌లో 1శాతం నష్టంతో రూ.1870ల వద్ద షేరు ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఉదయం గం.9:25ని.లకు

Most from this category