STOCKS

News


పెరిగిన పసిడి ధర

Saturday 6th October 2018
Markets_main1538801861.png-20907

అమెరికా సెప్టెంబర్‌ ఉద్యోగ గణాంకాలు అంచనాలను అందుకోలేకపోవడం శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 5డాలర్లు లాభపడింది. సెప్టెంబర్‌ నెలలో అంచనాల కంటే తక్కువగా 1,34,000 ఉద్యోగ కల్పన మాత్రమే జరిగింది. దీంతో నిరుద్యోగ రేటు 3.7 శాతంగా నమోదైంది. అంచనాల కంటే తక్కువగా 1,34,000 ఉద్యోగ కల్పన మాత్రమే జరిగింది. దీంతో నిరుద్యోగ రేటు 3.7 శాతంగా నమోదైంది. సెప్టెంబర్‌లో 185,000 ఉద్యోగాల సృష్టి జరుగుతుందని వేసినప్పటికీ ఆ స్థాయిలో లేబర్‌ మార్కెట్ ఊపందుకోలేదని అమెరికా గణాంకాల శాఖ శుక్రవారం తెలిపింది. నిరుత్సాహకరమైన ఉపాధి కల్పన గణాంకాలు నమోదు కారణంగా, వచ్చే నెలలో ఫెడ్‌ వడ్డీరేట్లను పెంచుతుందనే అంచనాలున్నప్పటికీ, డాలర్‌ విలువ తగ్గుముఖం పట్టింది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ 0.16శాతంగా నష్టపోయి 94.95 దిగువకు చేరుకుంది. చివరికి  95.31 స్థాయి వద్ద ముగిసింది. మరోవైపు పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ ఏడేళ్ల గరిష్టం 3.22శాతానికి చేరుకుంది. ఫలితంగా ఇన్వెస్టర్లు పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో అమెరికా శుక్రవారం రాత్రి 8డాలర్ల వరకు లాభపడి 1,209.80 డాలర్ల గరిష్టానికి చేరుకుంది. మార్కెట్‌ ముగిసే సమయానికి 5.10డాలర్లు లాభపడి 1,206.70 డాలర్ల వద్ద ముగిసింది.

దేశీయంగానూ పెరుగుదలే:-
అంతర్జాతీయంగా పెరిగిన ధరలకు అనుగుణంగానే దేశీయంగానూ పసిడి లాభపడింది. క్రితం రోజు ఉదయం ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో 74 వద్ద కొత్త జీవితకాల కనిష్టాన్ని నమోదు చేసిన రూపాయి రాత్రి  స్వల్ప రికవరీ కూడా పసిడి ర్యాలికి కారణమైంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో శుక్రవారం మార్కెట్‌ ముగిసే సమయానికి 10గ్రాముల పసిడి రూ.269.00లు లాభపడి రూ.31399.00ల వద్ద ముగిసింది.



You may be interested

తెలుగు రాష్ట్రాల్లోకి ‘హోమ్‌’ టీవీలు

Saturday 6th October 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఎల్‌ఈడీ టీవీల విపణిలోకి ఇటీవల ప్రవేశించిన కొత్త బ్రాండ్‌ ‘హోమ్‌’ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టింది. కంపెనీ 12 రకాల మోడళ్లను రూ.10,990-64,990 ధరల శ్రేణిలో విక్రయిస్తోంది. 365 రోజులపాటు రీప్లేస్‌మెంట్‌ వారంటీ ఉంది. 4కే హెచ్‌డీ స్మార్ట్‌ టీవీలు రూ.29,990 నుంచి, 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్‌ టీవీల శ్రేణి రూ.34,990 నుంచి అందుబాటులో ఉంది. మొబైల్స్‌ రిటైల్‌ దుకాణాల్లో ఈ టీవీలు లభిస్తాయి. హ్యాండ్‌సెట్స్‌

భారత్‌లో అస్తవ్యస్త పన్ను విధానాలు

Saturday 6th October 2018

న్యూఢిల్లీ: భారత్‌లో పన్ను విధానాలు అస్తవ్యస్తంగా ఉన్నాయంటూ రష్యన్ ఇంధన దిగ్గజం రాస్‌నెఫ్ట్‌ విమర్శించింది. దేశంలో కార్యకలాపాల విస్తరణకు ఇవే ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయంటూ వ్యాఖ్యానించింది. "భారతీయ కంపెనీ రష్యాలో ఇన్వెస్ట్ చేస్తే.. సాధారణంగానే పన్నులు కట్టాల్సి ఉంటుంది. డివిడెండ్లు ఇవ్వాల్సి ఉంటుంది. అదే మా కంపెనీ గానీ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే.. పన్నులు, డివిడెండ్లతో పాటు మాపై మరో 20 శాతం మేర విత్‌హోల్డింగ్ ట్యాక్స్ కూడా విధిస్తున్నారు.

Most from this category