పెరిగిన పసిడి
By Sakshi

ప్రపంచమార్కెట్లో పసిడి ధర గురువారం 3నెలల గరిష్టం వద్ద స్థిరంగా ట్రేడ్ అవుతోంది. అమెరికా మార్కెట్ల నష్టాల ముగింపును అందుకున్న ఆసియా మార్కెట్లు నేడు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. ఈక్విటీ మార్కెట్ల నష్టాల ఓపెనింగ్ కారణంగా ఆసియాలో ఇన్వెస్టర్లు పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపారు. నేడు ఆసియాలో ఔన్స్ పసిడి ధర 1,236.40 డాలర్ల వద్ద ప్రారభమైంది. ఇంట్రాడేలో క్రమంగా పసిడికి డిమాండ్ పెరగడంతో ఔన్స్ పసిడి ధర ఏకంగా ఏకంగా 10డాలర్లు పెరగి 1,240.80డాలర్ల స్థాయిని తాకింది. భారత వర్తమానకాల ప్రకారం ఉదయం గం.10:00ని.లకు ఔన్స్ పసిడి ధర 8.50 డాలర్లు లాభపడి 1239.40 వద్ద ట్రేడ్ అవుతోంది.అమెరికా మార్కెట్లు బుధవారం భారీ నష్టాల ముగింపు కారణంగా అక్కడ ఔన్స్ పసిడి 1,231.10డాలర్ల వద్ద ముగిసింది.
దేశీయంగానూ అదే ధోరణి:-
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయంగానూ పసిడి ధర పెరిగింది. ఎంసీఎక్స్ మార్కెట్లో నేడు 10గ్రాముల పసిడి ధర రూ.165.00లు పెరిగి రూ.32078.00ల వద్ద ట్రేడ్ అవుతోంది. దేశీయంగా రూపాయి బలహీనపడినప్పటికీ పసిడి ధర లాభం పడటం విశేషం. ఎంసీఎక్స్‌లో బుధవారం రాత్రి 10గ్రాముల పసిడి ధర రూ.31913ల వద్ద ముగిసింది.
You may be interested
భారత్‌లో మరిన్ని పెట్టుబడులు: యూపీఎస్
Thursday 25th October 2018ముంబై: న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్ లిస్టెడ్ కంపెనీ యూపీఎస్, భారత్‌లోని తన ఎక్స్‌ప్రెస్ సర్వీసుల (వాయు రవాణా) విభాగంపై మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది. గతంలో జాయింట్ వెంచర్‌గా ఉన్న ఈ విభాగంలో పూర్తి వాటాను సొంతం చేసుకునేందుకు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ఆర్థికంగా ఎదుగుతున్న భారత్ వంటి మార్కెట్లలో వ్యూహాత్మక పెట్టుబడులకు కట్టుబటి ఉన్నట్టు కంపెనీ ప్రకటించింది. చిన్న ప్యాకేజీలు, సప్లయ్ చైన్ సొల్యూషన్స్, కాంట్రాక్టు లాజిస్టిక్స్ సేవలు
తగ్గిన రూపాయి
Thursday 25th October 201814 పైసలు నష్టంతో 73.30 వద్ద ప్రారంభం ఇండియన్ రూపాయి గురువారం బలహీనపడింది. ఆసియా కరెన్సీలు మిశ్రమంగా ఉండటం ఇందుకు కారణం. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.31 వద్ద ట్రేడవుతోంది. రూపాయి తన బుధవారం ముగింపు 73.16తో పోలిస్తే 0.20 శాతం నష్టపోయింది. రూపాయి గురువారం 73.30 వద్ద ప్రారంభమైంది. భారత్‌లో పదేళ్ల బాండ్ ఈల్డ్స్ 7.853 శాతంగా ఉన్నాయి. బాండ్ ఈల్డ్స్ మునపటి ముగింపు