STOCKS

News


మూడు వారాల కనిష్టం నుంచి కోలుకున్న పసిడి

Wednesday 23rd January 2019
Markets_main1548217187.png-23739

ప్రపంచమార్కెట్లో పసిడి 3వారాల కనిష్టం నుంచి పుంజుకుంది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల పతనం పసిడి రికవరికి దోహదపడ్డాయి. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధి అంతంత మాత్రంగా ఉంటుందనే ఐక్యరాజ్యసమితి నివేదకలు వెల్లడించడంతో ఐరోపా, అమెరికా, ఆసియా ఈక్విటీ మార్కెట్లు నష్టాల పట్టాయి. ఫలితంగా ఈక్విటీ మార్కెట్లకు వ్యతిరేకంగా ట్రేడయ్యే పసిడి రాత్రి అమెరికా మార్కెట్లో 7డాలర్లు లాభపడి 1283.40 వద్ద ముగిసింది. నిన్న ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో డాలర్‌ ఇండెక్స్‌ రెండువారాల గరిష్టానికి ఎగబాకడంతో పసిడి 3వారాల కనిష్టస్థాయి 1,276.85 డాలర్లకు పతనమైన సంగతి తెలిసిందే. ఇక నేటి ఉదయం ఆసియా మార్కెట్లో పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. చైనా - అమెరికాల మధ్య వాణిజ్య ఉద్రికత్తలు నెలకొన్నప్పటికీ.., ప్రపంచ ఆర్థిక వృద్ధి ఆం‍దోళనలు తదితరకారణాల నేపథ్యంలో ఆసియాలో ఈక్విటీ మార్కెట్ల మిశ్రమ ట్రేడింగ్‌ ఇందుకు నేపథ్యం. భారత వర్తమాన కాల ప్రకారం ఉదయం గం.9:30ని.లకు ఔన్స్‌ పసిడి ధర అరడాలరు స్వల్ప లాభంతో 1284 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
దేశీయంగా స్వల్పనష్టాల్లో:-
ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి రీవకరీతో దేశీయ మార్కెట్లో పసిడి ధర స్వల్ప నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. ఎంసీక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర బుధవారం రూ.20ల స్వల్ప నష్టంతో రూ.32140.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గత రాత్రి ఎంసీక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ.155లు లాభపడి రూ.32160 వద్ద స్థిరపడింది.



You may be interested

షేర్ల ఎంపికలో అప్రమత్తత అవసరం: ఆనంద్‌ రాఠి

Wednesday 23rd January 2019

ప్రస్తుత ఏడాది భార‌త ఈక్వీటీ మార్కెట్‌ కొన్ని సానుకూలాంశాలు, మ‌రికొన్ని ప్రతికూలాంశాలతో  మిశ్రమంగా ట్రేడ‌య్యే అవ‌కాశం ఉంద‌ని బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్ రాఠి అనలిస్ట్‌ సిద్ధార్థ్ సేదాని అంచ‌నా వేస్తున్నారు. భార‌త స్థూల ఆర్థిక వ్యవ‌స్థ బ‌లంగా ఉండ‌టం మన ఈక్విటీ మార్కెట్‌కు క‌లిసొచ్చే అంశ‌మ‌ని సిద్ధార్థ్ సేదాని అంటున్నారు. ఆయన అంచనాల ప్రకారం...... బ్యాంకుల నిర‌ర్థక ఆస్తులు క్రమంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గ‌తేడాదిలో మార్చిలో 11శాతంగా న‌మోదైన బ్యాంకుల ఎన్‌పీఏలు సెప్టెంబ‌ర్

స్వల్పలాభాలతో ప్రారంభం

Wednesday 23rd January 2019

సెన్సెక్స్‌ 49 పాయింట్లు, నిఫ్టీ 9 పాయింట్లు అప్‌ గత రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు 1 శాతం తగ్గుదలతో ముగిసినప్పటికీ, బుధవారం ఉదయం ఆసియా సూచీలు స్థిరంగా ట్రేడవుతున్న నేపథ్యంలో భారత్‌ మార్కెట్‌ స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 49 పాయింట్లు పెరిగి 36,494 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9 పాయింట్ల లాభంతో 10,931 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో యస్‌బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో,

Most from this category