STOCKS

News


3వారాల కనిష్టం నుంచి పుత్తడి రికవరీ

Thursday 1st November 2018
Markets_main1541048274.png-21624

డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో గురువారం పసిడి ధర 3వారాల కనిష్టస్థాయి నుంచి రీవకరీ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో భారత వర్తమానకాలం ప్రకారం ఉదయం గం.10.00లకు ఔన్స్‌ పసిడి ధర 4డాలర్ల లాభపడి 1,219.00 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రపంచమార్కెట్లల్లో లాభాల ర్యాలీతో పాటు బ్రెగ్జిట్‌ అంశంలో సానుకూలతల కారణంగా నేటి ట్రేడింగ్‌లో డాలర్‌ ఇండెక్స్‌ అమ్మకాల ఒత్తిడికి లోనవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ ఈ ఏడాది గరిష్టం 97 నుంచి పతనమై 96.65 స్థాయి వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రైవేట్‌ రంగ ఉపాధి గణాంకాలు అక్టోబర్‌లో 8 నెలల గరిష్టానికి చేరడంతో రాత్రి అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి.
దేశీయంగా స్వల్ప పెరుగుదల:-
అంతర్జాతీయంగా పసిడి ధర పెరగడంతో దేశీయంగా పసిడి ధర లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. నేడు ఎంసీక్స్‌లో 10గ్రాముల పసిడి ధర రూ.45.00లు లాభపడి రూ.31882.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్న రాత్రి ఎంసీక్స్‌ మార్కెట్‌ ముగింపు సమయానికి 10గ్రామలు పసిడి రూ.31737 వద్ద స్థిరపడింది. ఇక ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి బలపడింది.



You may be interested

ఫలితాలతో ఎల్‌ అండ్‌ టీ దూకుడు..!

Thursday 1st November 2018

ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్‌అండ్‌టీ) షేరు గురువారం ట్రేడింగ్‌లో 6.50శాతం లాభపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ సాధించిన అద్భుతమైన ఫలితాలు షేరు ర్యాలీకి కారణమయ్యాయి. కంపెనీ నికరలాభం ఈ క్యూ2లో 28శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.2020 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ క్యూ2లో రూ.2593 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం రూ.26, 846 కోట్ల నుంచి రూ.32,506 కోట్లకు

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 1st November 2018

వివిధ వార్తల్లోని షేర్లకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు..! కోల్‌ ఇండియా:- వాటా విక్రయానికి మంచి స్పందన లభించింది. సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి రూ.4300 కోట్ల విలువైన షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. సంస్థాగత ఇన్వెస్టర్లకు 14.89 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించగా రూ.15.84 కోట్ల షేర్లకు స్పందన లభించింది. అంటే 106శాతం ఓవర్‌ సబ్‌స్క్రెబ్‌ అయిందన్న మాట.  ఓఎఫ్‌ఎస్‌ షేర్ల జారీ భాగంగా నేటి (నవంబర్‌ 1న) నుంచి 3.96ఈక్విటీ

Most from this category