STOCKS

News


పసిడి 1300 డాలర్ల వైపు అడుగులు

Thursday 10th January 2019
Markets_main1547096134.png-23495

ప్రపంచమార్కెట్లో పసిడి అడుగులు మరోసారి 1300డాలర్లు దిశగా కదులుతున్నాయి. డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత అందుకు తోడ్పాటును అందిస్తుంది. ఆసియా మార్కెట్లో గురువారం ఉదయం గం.10:00ని.లకు ఔన్స్‌ పసిడి ధర 5డాలర్లు లాభపడి 1,297 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ డిసెంబర్‌లో జరిపిన సమీక్ష వివరాలు బుధవారం వెల్లడయ్యాయి. అందులో ఫెడ్‌ సభ్యుల్లో ఎక్కువ మంది వడ్డీ రేట్లపై మెతకవైఖరి వహించాలని కోరినట్లు తెలుస్తుంది. ఫలితంగా డాలర్‌ ఇండెక్స్‌పై తీవ్ర ఒత్తిడి ఏర్పడి నేడు ఆరు ప్రధాన కరెన్సీలో విలువలో 95స్థాయిని కోల్పోయి 94.69 వద్ద ట్రేడ్‌ అవుతోంది. చైనా ద్రవ్యోల్బణం గణాంకాలు విశ్లేషకుల అంచనాల కంటే తక్కువగా నమోదుకావడంతో నేడు ఆసియాలో పలు మార్కెట్లు నష్టాల్లో అవుతున్నాయి. మరోవైపు అమెరికా-చైనా దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధ చర్చలు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత వహిస్తూ పసిడి ప్యూచర్ల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా నేటి ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర ఒకానొకదశలో 6డాలర్ల వరకు ర్యాలీ చేసి 1,298.00డాలర్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది.
రూ.32000 పైన పసిడి ధర:-
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర  పరుగులు పెడుతున్నప్పటికి.., దేశీయంగా మాత్రంగా స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ మారకంలో రూపాయి ఫ్లాట్‌ ట్రేడింగ్‌ దేశీయంగా పసిడి ధరకు అడ్డుకట్ట వేస్తుంది. ఎంసీఎక్స్‌లో నేటి ఉదయం గం.11:15ని.లకు ఫిబ్రవరి కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.43లు లాభపడి రూ.32044.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అయితే ఈ వారంలో రూపాయి పతనంతో పసిడి ధర రూ.32000 పైకి చేరడం విశేషం.



You may be interested

మొబైల్ వాలెట్లకు మార్చి గండం

Thursday 10th January 2019

కేవైసీ ధృవీకరణకు ఫిబ్రవరి డెడ్‌లైన్‌ గడువులోగా ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు తక్కువే ఆధార్‌పై చెల్లుబాటుపై సుప్రీం తీర్పుతో మరిన్ని దీంతో 95 శాతం వాలెట్లు మూతబడే పరిస్థితి న్యూఢిల్లీ: డిజిటల్‌ విప్లవంతో కుప్పతెప్పలుగా పుట్టుకొచ్చిన మొబైల్‌ వాలెట్‌ సంస్థలకు ప్రస్తుతం కేవైసీ నిబంధనలు సంకటంగా మారాయి. ఈ ఏడాది ఫిబ్రవరి ఆఖరు నాటికి కస్టమర్లందరి వివరాల (కేవైసీ) ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేయాలన్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాలను అమలు చేయడానికి వాలెట్‌ సంస్థలు పరుగులు

గురువారం వార్తల్లో షేర్లు

Thursday 10th January 2019

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావివతయ్యే షేర్ల వివరాలు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌:- ఆంధ్రప్రదేశ్‌లోని డాటా సెంటర్‌ ఏర్పాటుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మౌఖిక ఒ‍ప్పందాన్ని కుదుర్చుకుంది. విశాఖపట్నంలోని 500 ఎకరాల్లో మూడు ప్రాంతాల్లో 5 గిగా వాట్ డాటా సెంటర్‌ను అదాని గ్రూప్‌ ఏర్పాటు చేయనుంది. ఇర‌వై ఏళ్లలో ల‌క్ష ఉద్యోగాలు క‌ల్పించే ఈ సెంట‌ర్ కోసం అదానీ గ్రూప్ 70 వేల కోట్ల రూపాయ‌లు పెట్టుబ‌డులు పెట్టనుంది. అశోక్‌ లేలాండ్‌:- చెన్నై,

Most from this category