STOCKS

News


స్వల్పంగా తగ్గిన పసిడి

Monday 29th October 2018
Markets_main1540788618.png-21546

డాలర్‌ ఇండెక్స్‌ 10 వారాల గరిష్టానికి చేరుకోవడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర సోమవారం 3నెలల గరిష్టస్థాయి నుంచి దిగివస్తుంది. ఆసియాలో ట్రేడింగ్‌లో భారత వర్తమానకాల ప్రకారం ఉదయం గం.10:00ని.లకు ఔన్స్‌ పసిడి ధర 2డాలర్లు నష్టపోయి 1,234.00 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా ఆర్థికవృద్ధి అంచనాల కంటే  తక్కువగా ఉండటంతో పాటు, పలు ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి వాతావరణ పరిస్థితులు డాలర్‌ ఇండెక్స్‌కు బలాన్నిస్తున్నాయి. ఈనేపథ్యంలో డాలర్‌ ఇండెక్స్‌ ఆరు ప్రధాన కరెన్సీ విలువలతో పోలిస్తే 10-వారాల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతోంది. మరోవైపు ఆసియా మార్కెట్లు కూడా గతవారం నష్టాల నుంచి కొలుకుని మిశ్రమంగా ట్రేడ్‌ అవుతుండటం కూడా పసిడి ధర దిగిరావడానికి కారణమవుతోంది.
దేశీయ స్వల్పంగా పెరుగుదల:-
గత వారం నష్టంతో ముగిసిన డిసెంబర్‌ కాంటాక్టు పసిడి ధర ఈ వారం కూడా స్వల్ప నష్టంతో ప్రారంభమైంది. నేడు ఎంసీక్స్‌లో 10గ్రాముల పసిడి ధర గతవారం ముగింపు ధర(రూ.31,937)తో రూ.34లు నష్టంతో రూ.31903ల వద్ద ప్రారంభమైంది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలహీనత కారణంగా తిరిగి లాభాల్లోకి మళ్లీంది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో ఉదయం గం.10:00ని.లకు 10గ్రాముల పసిడి ధర రూ.47.00లు లాభంతో రూ.31984.00లు వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ఫలితాలు గణాంకాలపై దృష్టి

Monday 29th October 2018

- ఈవారంలోనే కీలక గణాంకాల వెల్లడి - బుధవారం.. సెప్టెంబర్‌ ద్రవ్యలోటు, ఇన్‌ఫ్రా అవుట్‌పుట్‌ డేటా - గురువారం... నికాయ్‌ తయారీ రంగ పీఎంఐ, ఆటో రంగ అమ్మకాల గణాంకాలు - శుక్రవారం అమెరికా నిరుద్యోగ గణాంకాలు - 796 బీఎస్‌ఈ కంపెనీల క్యూ2 ఫలితాలు ఈవారంలోనే - రూపాయి కదలికలు కీలకం..! ముంబై: స్థూల ఆర్థిక సమాచారం, కొనసాగుతున్న జూలై–సెప్టెంబర్‌ (క్యూ2) ఆర్థిక ఫలితాల వెల్లడి ఈ వారం స్టాక్‌ మార్కెట్‌కు అత్యంత కీలకం కానున్నాయని దలాల్‌

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 29th October 2018

వివిధ వార్తలను అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు..! ఐసీఐసీఐ బ్యాంక్‌:- అదనపు డైర్టెక్టర్‌గా హరి ఎల్‌ ముంద్రా నియమితులయ్యారు. ఈయన బ్యాంకు ఐదేళ్ల పాటు తన సేవలను అందించనున్నారు. బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌:- బెంగళూర్‌లోని కోగిలు రోడ్డులో బ్రిగేడ్‌ బ్రిక్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. క్వాలిటీ:- ప్రస్తుతం సంస్థ సీఎఫ్‌ఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న సతీష్‌ కుమార్‌ గుప్తా రాజీనామా చేశారు. ఆయన స్థానంలో శరద్‌ బండారీ నియమితులయ్యారు. కాక్స్‌&కింగ్స్‌:- తన విద్యా వ్యాపారాన్ని బ్రిటన్‌కు చెందిన మిడ్లోథియన్

Most from this category