STOCKS

News


ఎగిసిన పసిడి ధర

Tuesday 18th December 2018
Markets_main1545111856.png-23039

అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగమన భయాలు పసిడి ధరను పరుగులు పెట్టించాయి. ఫలితంగా నిన్నటి ట్రేడింగ్‌ సెషన్‌లో పసిడి ధర 11డాలర్లు ర్యాలీ చేసింది. గత రెండువారాల్లో ఒకేరోజులో పసిడి ఇంతస్థాయిలో లాభపడటం ఇదే మొదటిసారి. రాత్రి అమెరికా మార్కెట్లో వడ్డీరేట్ల పెంపు భయాలతో పాటు ఆర్థిక వృద్ధి నెమ్మదించదనే కారణంతో అక్కడి స్టాక్‌మార్కెట్లు 19నెలల కనిష్టానికి చేరుకున్నాయి. దీంతో అక్కడి మార్కెట్లో పసిడి ధర ఇంట్రాడేలో 1,252.20 గరిష్టాన్ని తాకి చివరికి  1251.85 డాలర్ల వద్ద ముగిసింది. కిత్రం లాభాల ర్యాలీని అందుకున్న పసిడి నేటి ఆసియా ట్రేడింగ్‌లో 1,250.00 డాలర్ల వద్ద ప్రారంభమైంది. ఆసియాలో పలు మార్కెట్లలో నెలకొన్న బలహీన పరిస్థితులు, డాలర్‌ ఇండెక్స్‌ 19నెలల గరిష్టం నుంచి దిగిరావడం తదితర కారణాలు పసిడికి ధరకు అండగా నిలుస్తున్నాయి. అలాగే వడ్డీరేట్లపై ఫెడ్‌ నిర్ణయం కోసం ఇన్వెస్టర్ల ఎదురు చూపులు కూడా పసిడి స్థిరమైన ర్యాలీకి కారణమవుతున్నాయి. మంగళవారం ఉదయం గం.10:45ని.లకు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర గత రాత్రి ముగింపు ధర(1251.85 డాలర్లు)తో పోలిస్తే అరశాతం లాభపడి 1252.35 డాలర్లు వద్ద ట్రేడ్‌ అవుతోంది.
రూపాయి రీకవరీ: నష్టాల్లో పసిడి
ఇదే దేశీయంగా రూపాయి రికవరీ పసిడిని నష్టాల బాట పట్టింది. కిత్రం ట్రేడింగ్‌ సెషన్‌లో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర భారీ ర్యాలీ చేసినప్పటి.., దేశీయంగా రూపాయి రికవరీ పసిడి ధరను అడ్డుకుంది. ఫలితంగా రాత్రి ఎంసీక్స్‌లో మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా రూ.77లు లాభపడి రూ.31630ల వద్ద ముగిసింది. నేడు ఎంసీఎక్స్‌లో పసిడి ధర రూ.31,530.00ల వద్ద ప్రారంభమైంది. దేశీయంగా డాలర్‌ మారకంలో రూపాయి బలపడటంతో పసిడి ధర నష్టాల బాట పట్టింది. ఉదయం గం.10:45ని.లకు 10గ్రాముల పసిడి ధర క్రితం ముగింపు ధర (రూ.31630లు)తో పోలిస్తే రూ.105లు నష్టపోయి రూ.31525.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ఈ షేర్లలో ‘శాంతా ర్యాలీ’

Tuesday 18th December 2018

బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచిన ఎంఏసీడీ ఇండికేటర్‌ మార్కెట్లో బుల్స్‌ పట్టు పెరగడంతో పలు షేర్లలో ర్యాలీ సంకేతాలు కన్పిస్తున్నాయంటున్నారు నిపుణులు. తాజా పరుగు  చూస్తుంటే సూచీల్లో శాంతా ర్యాలీ ఆరంభమైనట్లుందని అంచనా వేస్తున్నారు. సోమవారం ముగింపు ప్రకారం 121 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో వొడాఫోన్‌ ఐడియా,

10,600 స్టాప్‌లాస్‌!

Tuesday 18th December 2018

నిఫ్టీ లాంగ్స్‌పై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సూచన కేవలం ఐదు సెషన్లలో నిఫ్టీ 550 పాయింట్ల ర్యాలీ జరిపి సోమవారం 10900 పాయింట్లకు చేరువలో క్లోజయింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మంగళవారం కాస్త వెనకడుగు వేసి 10830 పాయింట్ల వద్ద కదలాడుతోంది. తాజా ర్యాలీలో నిఫ్టీ తన అధోముఖ వాలు రేఖను అవలీలగా దాటేసింది. దీంతో పాటు 200 రోజుల డీఎంఏ స్థాయి 10757ను కూడా అధిగమించింది. ప్రస్తుతం నిఫ్టీ తన 20,

Most from this category