STOCKS

News


వారం కనిష్టానికి పసిడి

Tuesday 5th February 2019
Markets_main1549345653.png-24016

డాలర్‌ ఇండెక్స్‌ ర్యాలీతో మంగళవారం పసిడి ధర వారం రోజుల కనిష్టానికి చేరుకుంది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ పుంజుకోవడంతో పాటు జనవరిలో అమెరికా ఉద్యోగ కల్పన గణాంకాలు అంచనాలకు మించి నమోదుకావడంతో ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులకు మొగ్గుచూపారు. అలాగే బాండ్‌ ఈల్డ్స్‌ పెరగడం కూడా పసిడి ధరపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 9డాలర్లు నష్టపోయి 1,312.85 డాలర్ల స్థాయికి పతనమైంది. ఇది పసిడికి వారం రోజుల కనిష్టస్థాయి. చివరకు 1,319.30 వద్ద ముగిసింది. నేడు ఆసియా మార్కెట్లలో 1,316.45 డాలర్ల వద్ద ప్రారంభమైంది. ఆసియాలో కొన్ని ప్రధాన మార్కెట్ల సెలవులో ఉండటంతో పాటు డాలర్‌ ఇండెక్స్‌ స్థిరమైన ర్యాలీ కారణంగా పసిడి ధర గతముగింపు(1,319.30)తో పోలిస్తే 4డాలర్లు నష్టపోయి 1,315.45 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
దేశీయంగా స్వల్ప పెరుగుదల:-
దేశీయమార్కెట్లో పసిడి ధర స్వల్పంగా పెరిగింది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ.24.00లు పెరిగి రూ.33491.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. క్రితం ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి బలహీనత కారణంగా దాదాపు రూ.200ల మేర లాభపడిన పసిడి రూ.33467.00ల వద్ద ముగిసింది.



You may be interested

అనిల్‌ పని అయిపోయిందా..?

Tuesday 5th February 2019

అడాగ్‌ గ్రూప్‌ షేర్ల కకావికలం లక్షల కోట్ల వేల్యుయేషన్స్‌ ఆవిరి కీలకమైన ఆర్‌కామ్‌ దివాలా భారీ రుణభారంలో మిగతా గ్రూప్‌ సంస్థలు సినిమా, డిఫెన్స్‌, ఫైనాన్స్‌... అన్నిటిదీ అదేదారి షేర్‌హోల్డర్లకు భారీ నష్టాలు అన్న ముకేశ్‌తో పోలిస్తే 5 శాతం కూడా లేదు! అన్నదమ్ములిద్దరూ దాదాపు ఒకే దగ్గర జర్నీ ప్రారంభించారు. కానీ ఒకరు ఆకాశామే హద్దుగా ఎదుగుతుంటే.. మరొకరు అధఃపాతాళం లోతుల్లోకి జారిపోతున్నారు. దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో నువ్వా, నేనా అన్నట్లుగా ఒకప్పుడు అన్న ముకేశ్‌ అంబానీతో

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 5th February 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు కోల్‌ ఇండియా:- రూ.1050 కోట్ల విలువైన నిధుల సమీకరణకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రణాళికలో భాగంగా కంపెనీ ప్రతి షేరు ధర రూ.235 చొప్పున మొత్తం 4.46లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. ఫ్యూచర్‌ రిటైల్‌:- ప్రమోటర్‌ గ్రూప్‌ సం‍స్థ ఫ్యూచర్‌ కూపన్స్‌ లిమిటెడ్‌కు ఈక్విటీ షేర్లను జారీ చేసి రూ.2000 కోట్లను సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రతి

Most from this category