STOCKS

News


లాభాల్లో పసిడి

Wednesday 2nd January 2019
Markets_main1546403622.png-23354

ఆసియా మార్కెట్ల నష్టాల ట్రేడింగ్‌ పసిడి ధరకు కలిసొస్తుంది. ఈ ఏడాదిలో పసిడికి తొలి ట్రేడింగ్ రోజైన బుధవారం ఆసియా ట్రేడింగ్లో ఉదయం సెషన్లో 4డాలర్లు లాభపడింది. అమెరికా ఫ్యూచర్లు నష్టాల ట్రేడింగ్‌ సైతం పసిడి ర్యాలీకి సహకరిస్తుంది. ఉదయం 9:45ని.లకు ఔన్స్ పసిడి ధర 3.55 డాలర్లు లాభపడి 1,284.85 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.  ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనంతో చైనా ఉత్పాదక రంగం 2107 మే తరువాత తొలిసారి నెమ్మదించింది. మరోవైపు అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌ అంశంపై చర్చించేందుకు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌ ఇరు పార్టీలకు చెందిన కాంగ్రెస్‌ అధికార ప్రతినిధులను వైట్‌హౌస్‌కు ఆహ్వానించారు. అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధంతో పాటు, అమెరికా ప్రభుత్వంతో ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ విబేధాలు తదితర కీలకాంశాలు చివరి క్వార్టర్‌ ఫలితాలపై ప్రభావాన్ని చూపవచ్చని విశ్లేషకులు పడ్డారు. ఫలితంగా అమెరికా ఫ్యూచర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ ప్రతికూలాంశాలతో నేడు ఆసియాలో అన్ని మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఈక్విటీ మార్కెట్ల పతనంతో ఇన్వెస్టర్లు ప్రతికూల సమయాల్లో రక్షణాత్మక ధోరణిగా భావించే పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ పెరిగింది. 
 దేశీయంగా లాభాల్లోనే:‍‍‍-
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయంగానూ పసిడి ధర లాభాల పట్టింది. ప్రపంచమార్కెట్లో పసిడి ధర పెరగడం, దేశీయంగా డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలహీనత తదితర అంశాలు పసిడికి కలిసొస్తున్నాయి. ఎంసీక్స్‌ మార్కెట్లో ఉదయం 10:00లకు 10గ్రాముల పసిడి ధర రూ.11లు లాభపడి రూ.31433
ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. రాత్రి ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత కారణంగా పసిడి ధర స్వల్పంగా రూ.31.00లు పెరిగి రూ.31422.00ల వద్ద ముగిసింది.



You may be interested

నష్టాల్లో మెటల్‌ షేర్లు

Wednesday 2nd January 2019

అంతర్జాతీయంగా మెటల్‌ షేర్ల పతనంతో దేశీయ మార్కెట్లో ఈ రంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 2శాతం వరకు క్షీణించింది. చైనా ఉత్పాదక రంగం నెమ్మదించడంతో అంతర్జాతీయ మార్కెట్లో మెటల్ షేర్లు నష్టాల బాట పట్టాయి. మరోవైపు ప్రముఖ రేటింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ జేఎస్‌డబ్లూ‍్య స్టీల్‌,  టాటా స్టీల్‌ షేర్ల ధరలకు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌

గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Wednesday 2nd January 2019

సెన్సెక్స్‌ 150 పాయింట్లు, నిఫ్టీ 52 పాయింట్లు డౌన్‌   ప్రతికూల ఆసియా సంకేతాల నేపథ్యంలో బుధవారం భారత్‌ సూచీలు గ్యాప్‌డౌన్‌తో ఆరంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 150 పాయింట్ల తగ్గుదలతో 36, 104 పాయింట్ల వద్ద, నిఫ్టీ 52 పాయింట్ల క్షీణతతో 10,858 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. మెటల్‌ షేర్లు టాటా స్టీల్‌, వేదాంత, హిందాల్కోలు ట్రేడింగ్‌ ప్రారంభంలో 2 5 శాతం నష్టపోయాయి. అలాగే ఆటోమొబైల్‌ షేర్లు మహింద్రా, ఐషర్‌ మోటార్స్‌,

Most from this category