STOCKS

News


స్వల్పంగా పెరిగిన పసిడి

Tuesday 23rd October 2018
Markets_main1540269945.png-21379

ప్రపంచ మార్కెట్లో మంగళవారం పసిడి ధర స్వల్పంగా పెరిగింది. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, రాజకీయ అనిశ్చితి పరిస్థితులు ఇందుకు కారణమవుతున్నాయి. ఆసియా ట్రేడింగ్‌లో భారత వర్తమానకాల ప్రకారం ఉదయం గం.9:45ని.లకు ఔన్స్‌ పసిడి ధర 3డాలర్ల పెరిగి 1227.30 వద్ద ట్రేడ్‌ అవుతోంది. సౌది అరేబియా, పాశ్చత్య దేశాల మధ్య ముదిరిన రాజకీయ వివాదాలకు తోడు, బ్రెగ్జిట్‌, ఇటలీ బడ్జెట్‌ తదితర వివాదస్పద అంశాలు మరోసారి తెరపైకి వచ్చా‍యి. ఫలితంగా నేడు ఆసియాలో అన్ని మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఈ తరుణంలో ఇన్వెస్టర్లు సంక్షోభ సమయాల్లో వ్యూహాత్మకంగా రక్షణాత్మక ధోరణి అవలంభిస్తూ పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకి మొగ్గుచూపుతున్నారు. గత రాత్రి అమెరికా మార్కెట్ల మిశ్రమ ముగింపు కారణంగా అక్కడ ఔన్స్‌ పసిడి 1,224.60 డాలర్ల వద్ద ముగిసింది.
దేశీయంగానూ పెరుగుదలే:-
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయంగా పసిడి ధర పెరిగింది. డాలర్‌ మారకంలో రూపాయి బలహీనపడం, దేశీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు నష్టాల ట్రేడింగ్‌ పసిడి ధరపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఫలితంగా ఎంసీఎక్స్‌ మార్కెట్లో నేడు 10గ్రాముల పసిడి ధర రూ.98.00లు లాభపడి రూ.31992.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. మంగళవారం రాత్రి ఎంసీఎక్స్‌లో 10గ్రాముల పసిడి ధర రూ.31894 వద్ద ముగిసింది.



You may be interested

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ పరిష్కార ప్రణాళికపై కసరత్తు

Tuesday 23rd October 2018

ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఇన్‌ఫ్రా‍స్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను (ఐఎల్‌ఎఫ్‌ఎస్‌) గాడిన పెట్టే దిశగా కొత్త బోర్డు చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పరిష్కార ప్రణాళిక రూపకల్పన, అమలు కోసం మూడు సంస్థలను అడ్వైజర్లుగా నియమించింది. ఆర్ప్‌వుడ్‌ క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్‌ సంస్థలను ఆర్థిక అంశాలు.. ఇతరత్రా లావాదేవీల సలహాదారులుగా (ఎఫ్‌టీఏ), అల్వారెజ్‌ అండ్ మార్సల్‌ (ఏఅండ్‌ఎం) సంస్థను పునర్‌వ్యవస్థీకరణపై అడ్వైజరుగా నియమించినట్లు కంపెనీ తెలిపింది.

మార్కెట్లోకి హీరో ‘డెస్టినీ 125’

Tuesday 23rd October 2018

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్‌.. దేశీ మార్కెట్‌లో ‘డెస్టినీ 125’ పేరిట సరికొత్త స్కూటర్‌ను సోమవారం విడుదల చేసింది. ఈ మోడల్‌ ధరల శ్రేణి రూ.54,650–రూ.57,500గా ఉన్నట్లు ప్రకటించింది. ఢిల్లీ/ఎన్‌సీఆర్‌లో విక్రయాలు ప్రారంభం కాగా, దేశవ్యాప్త అమ్మకాలు వచ్చే 3–4 వారాల్లో ప్రారంభంకానున్నట్లు కంపెనీ తెలియజేసింది. ఈ సందర్భంగా సంస్థ గ్లోబ‌ల్ ప్రోడ‌క్ట్ ప్లానింగ్ హెడ్ మాలో లీ మాస‌న్ మాట్లాడుతూ.. ‘125-సీసీ విభాగానికి చెందిన

Most from this category