STOCKS

News


పసిడి రూ. 300 జంప్‌

Thursday 15th November 2018
Markets_main1542259302.png-22038

గత రాత్రి అమెరికా ట్రేడింగ్‌లో 1శాతం ర్యాలీ చేయడంతో ఇక్కడ ఎంసీఎక్స్‌లో సైతం బుధవారం రాత్రి అంతేశాతం పెరిగింది. గత రాత్రి పెరుగుదలకు కొనసాగింపుగా గురువారం ఆసియా మార్కెట్లో భారత వర్తమానకాల ప్రకారం ఉదయం గం.10:15లకు ఔన్స్‌ పసిడి ధర 1.10డాలర్లు స్వల్పంగా పెరిగి 1211.20 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇక రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి 12డాలర్ల(1శాతం)లాభపడింది. ఈ డిసెంబర్‌లో ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపపై స్పష్టత రావడంతో అక్టోబర్‌లో నెలలో అమెరికా సీపీఐ గణాంకాలు మార్కెట్‌ వర్గాల అంచనాలకు కన్నా తక్కువగా నమోదు కావడంతో ఆ దేశ 10పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ భారీగా పతనమైంది. మరోవైపు యూరో, పౌండ్‌ కరెన్సీలు బలపడటంతో డాలర్‌ ఇండెక్స్‌ ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో 16నెలల గరిష్ట స్థాయి నుంచి తగ్గుముఖం పట్టింది. ఫలితంగా రాత్రి ఔన్స్‌ పసిడి 12 డాలర్లు లాభపడి రూ.1210.10 డాలర్ల వద్ద ముగిసింది.
దేశీయంగా రూ. 300 జంప్‌:-
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి స్థిరమైన ర్యాలీ దేశీయ పసిడిపై ప్రభావాన్ని చూపుతుంది. ఫలితంగా ఎంసీక్స్‌ మార్కెట్లో పసిడి ధర రెండురోజుల నష్టాల నుంచి గత రాత్రి గట్టెక్కి 10 గ్రాముల ధర రూ. 300 పెరుగుదలతో రూ.30,822 వద్దకు చేరింది.  నేడు ఎంసీక్స్‌లో ఈ ధర రూ.30,924.00ల వద్ద ప్రారంభమైంది. ఉదయం గం.10.30లకు గత ముగింపు ధర(రూ.30822)తో పోలిస్తే రూ.38.00లు స్వల్ప లాభంతో రూ.30860.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

9 రెట్లు పెరిగిన ఓవీఎల్‌ లాభం

Thursday 15th November 2018

న్యూఢిల్లీ: అధిక చమురు ధరల సానుకూలతతో ఓఎన్‌జీసీ విదేశ్‌ లిమిటెడ్‌ (ఓవీఎల్‌) సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో మంచి పనితీరు ప్రదర్శించింది. కంపెనీ లాభం ఏకంగా 878 శాతం వృద్ధితో రూ.1,384 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.142 కోట్లు కాగా, 2017-18 పూర్తి ఆర్థిక సంవత్సరంలోనూ మొత్తం లాభం రూ.981 కోట్లు మాత్రమే. గత ఆర్థిక సంవత్సరం ఆర్జించిన లాభానికి మించి

రాయల్‌ సుందరంలో ఏజీస్‌కు వాటా!

Thursday 15th November 2018

చెన్నై: సుందరం ఫైనాన్స్‌ సంస్థ, సాధారణ బీమా కంపెనీ రాయల్‌ సుందరంలో తనకున్న 75.90 శాతం వాటా నుంచి 25.90 శాతం వాటాను ఏజీస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ డీల్‌ విలువ రూ.1,520 కోట్లు. విక్రయం తర్వాత కూడా రాయల్‌ సుందరంలో సుందరం ఫైనాన్స్‌కు 50 శాతం వాటా ఉంటుంది. ఈ డీల్‌ ఐఆర్‌డీఏ తదితర సంస్థల అనుమతులపై ఆధారపడి ఉంటుందని, 2019 మొదటి మూడు

Most from this category