STOCKS

News


స్థిరంగా పసిడి ధర

Monday 19th November 2018
Markets_main1542603014.png-22160

డాలర్‌ బలహీనతతో పసిడి ధర సోమవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా మార్కెట్లో భారత వర్తమానకాల ప్రకారం ఉదయం గం.10:00లకు ఔన్స్‌ పసిడి ధర 1.00డాలర్లు స్వల్పంగా నష్టపోయి 1,222 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫెడ్‌ రిజర్వ్‌ అధికారులు ప్రపంచ ఆర్థిక వృద్ధి మం‍దగమనంపై ఆందోళనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు వర్గాలు  వచ్చే డిసెంబర్‌లో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నేడు డాలర్‌ ఇండెక్స్‌ ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో స్వల్పంగా(0.03శాతం) లాభపడి 96.49 స్థాయి వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చైనా దిగుమతులపై మరిన్ని టారీఫ్‌లు విధించకపోవచ్చని శుక్రవారం తెలపడంతో పలు నేడు ఆసియాలో పలు మార్కెట్ల లాభాల్లో ట్రేడ్‌ అవుతుండంతో కూడా పసిడి ధరపై ప్రభావాన్ని చూపుతోంది. గతవారం ట్రేడింగ్‌ చివరి రోజైన శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి 8డాలర్లు పెరిగి 1,223.00 డాలర్ల వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.
దేశీయంగా రూ.31వేల పైకి...:-
దేశీయంగా పసిడి ధర మళ్లీ రూ.31వేల పైకి చేరుకుంది. నేడు ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి స్వల్ప నష్టాల కారణంగా ఎంసీఎక్స్‌లో పసిడి ధర కూడా స్వల్ప లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. నేడు ఎంసీక్స్‌లో డిసెంబర్‌ కాంట్రాక్టు ధర రూ.31,010ల వద్ద ప్రారంభమైంది.  ఉదయం గం.10:00లకు ఎంసీక్స్‌లో 10గ్రాముల పసిడి ధర రూ.23.00లు లాభంతో రూ.31030.00ల వద్ద ముగిసింది. గతవారం ట్రేడింగ్‌ చివరి రోజైన శుక్రవారం ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాములు పసిడి ధర రూ.31007ల వద్ద ముగిసింది.



You may be interested

35,605పైన స్థిరపడితే అప్‌ట్రెండ్‌

Monday 19th November 2018

క్రూడ్‌ ధర అనూహ్య పతనం, రూపాయి పెరుగుదల కారణంగా భారత్‌ ఆర్థిక ఫండమెంటల్స్‌ మెరుగుపడినట్లే. వరుసగా రెండు నెలలపాటు భారీ విక్రయాలు జరిపిన విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకూ బిలియన్‌ డాలర్ల మేర నికర కొనుగోళ్లు జరపడం కూడా ఇండియాపట్ల వారి దృక్పథంలో వచ్చిన మార్పుకు సూచన.  ప్రపంచ ఆర్థిక వృద్ధి క్షీణిస్తుందన్న అంచనాల వల్ల  ఫెడ్‌ వడ్డీ రేట్ల భవిష్యత్తు పెంపుపై... ఇద్దరు ఫెడ్‌కమిటీ సభ్యులు సందేహం

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 19th November 2018

వివిధ వార్తలను అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఇవి జెట్‌ ఎయిర్‌వేస్‌:- టాటాసన్స్‌ జెట్‌ఎయిర్‌వేస్‌ కొనుగోలుపై ఎట్టకేలకు స్పందించింది. చర్చలు ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాయని త్వరలో నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకుంటామని టాటాసన్స్‌ స్పష్టం చేశారు. వోడాఫోన్‌:- సంస్థ ఫైబర్‌ ఆస్తులను భారతీఇన్ఫ్రాటెల్‌కు విక్రయిస్తున్నట్లు వెలువడిన వార్తలను ఖండించింది. తమ ఫైబర్‌ ఆస్తులను ఎవరికి విక్రయించడటం లేదని శుక్రవారం సంస్థ స్పష్టం చేసింది. డాక్టర్‌ రెడ్డీస్‌:-  ఆంధ్రప్రదేశ్‌లోని యూనిట్‌లో ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో

Most from this category