STOCKS

News


పెరిగిన పసిడి

Monday 25th March 2019
Markets_main1553498863.png-24781

అంతర్జాతీయ ఆర్థిక మాంద్య ఆందోళనలు పసిడి బలానిచ్చాయి. ఫలితంగా సోమవారం ట్రేడింగ్‌లో 5డాలర్లు లాభపడింది. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ ఉన్నట్టుండి ఈ ఏడాది(2019)లో వడ్డీ రేట్ల పెంపు ఉండబోదంటూ సంకేతాలివ్వడంతో ఇన్వెస్టర్లలో ఆర్థికవృద్ధి ఆందోళనలు రేకెత్తాయి. ఫలితంగా అమెరికాతో పాటు ఆసియాలోనూ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు రక్షణాత్మక ధోరణిలో భాగంగా పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో నేటి ట్రేడింగ్‌లో 5డాలర్లు వరకు ర్యాలీ చేసి 1,323.15డాలర్లకు ఎగసింది. మధ్యాహ్నం గం.12:00లకు గతముగింపు(1,318.70డాలర్లు)తో పోలిస్తే 4శాతం లాభంతో 1,322.85 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగమన భయాలు, బాండ్‌ మార్కెట్లో నెలకొన్న సంక్షోభ భయాలతో శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 6 డాలర్ల మేర లాభపడి 1,318.70డాలర్ల వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. 
దేశీయంగా స్వల్ప తగ్గుదల:-
ప్రపంచమార్కెట్లో పసిడి పెరిగినప్పటికీ, దేశీయంగా మార్కెట్లో మాత్రం స్వల్పంగా నష్టపోయింది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలపడటం పసిడి ర్యాలీకి ప్రతికూలంగా మారింది. నేడు ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ.20లు నష్టపోయి రూ.32,125.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ఆఖరి గడియల్లో ఈ తప్పులొద్దు

Monday 25th March 2019

పన్ను ఆదా ఒక్కటే కాదు.. రాబడులూ కీలకమే ముందు నుంచే ప్రణాళిక ప్రకారం పెట్టుబడులు ఈక్విటీ సాధనాల్లో ఒకేసారి కంటే సిప్‌ బెటర్‌ ఉన్నదంతా ఒకేసారి ఇన్వెస్ట్‌ చేస్తే అధిక రిస్క్‌ పెట్టుబడి సాధనానికి రిస్క్‌ను చూడాలి హడావిడితో అధిక రిస్క్‌కు వెళ్లొద్దు అత్యవసర నిధులను ముట్టొద్దు పన్ను ఆదా కోసం... పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌, ఎన్‌ఎస్‌సీ, పన్ను ఆదా ఎఫ్‌డీలు, యులిప్‌లు, ఈఎల్‌ఎస్‌ఎస్‌లు... వీటిల్లో ఏది అన్న ఎంపిక అంత సులభం కాదు.

ప్రతి పతనం ఒక అవకాశమే!

Monday 25th March 2019

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ నిఫ్టీ, సెన్సెక్స్‌ పలు రోజుల పరుగుల అనంతరం ప్రాఫిట్‌ బుకింగ్‌ చవిచూస్తున్నాయి. శుక్రవారం కనిపించిన బలహీనత మార్కెట్లో సోమవారం కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి పుల్‌బ్యాక్స్‌ను కొత్త కొనుగోళ్లకు అవకాశంగా భావించాలని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అనలిస్టు నాగరాజ్‌ షెట్టి సూచించారు. ప్రస్తుతం వచ్చిన బలహీనత ఓవర్‌బాట్‌ వల్ల వచ్చిందని, మరికొంత సమయం ఈ బలహీనత కొనసాగవచ్చని అంచనా వేశారు. అయితే ఈ బలహీనత సమయాలను కొనుగోళ్లకు అవకాశంగా

Most from this category