STOCKS

News


పసిడికి డాలర్‌ ఎఫెక్ట్‌

Tuesday 13th November 2018
Markets_main1542093713.png-21947

డాలర్‌ ఇండెక్స్‌ ఏడాదిన్నర గరిష్టం వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతుండడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర మంగళవారం కనిష్ట ధర వద్ద ట్రేడ్‌ అవుతోంది. భారత వర్తమానకాలం ప్రకారం ఉదయం గం.11.30లకు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి 0.40 డాలర స్వల్ప నష్టంతో 1,203.10 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. రాత్రి అమెరికా మార్కెట్లో డాలర్‌ ఇండెక్స్‌ 17 నెలల గరిష్టానికి చేరుకోవడంతో పసిడి ధర వరుసగా 3రోజు నష్టాలతో ముగిసింది. ఐరోపా కూటమి నుండి బ్రిటన్‌ నిష్క్రమించే (బ్రెగ్జిట్‌)గడువు దగ్గర పడుతున్న సమయంలో ఈ అంశంపై ఇంకా ఒప్పందం కుదరలేదని ఐరోపా కూటమి ప్రధాన సలహాదారు మైకేల్‌ బార్నియర్‌ కూటమి సభ్యదేశాలకు తెలియచేశారు. బ్రెగ్జిట్‌ ఆందోళనలు మరోసారి తెరపైకి రావడంతో బ్రిటన్‌ పౌండు పతనమైంది. ఫలితంగా మిగతా కరెన్సీలతో పోలిస్తే డాలరు ఇండెక్స్‌ విలువ 17 నెలల గరిష్టాన్ని అందుకోవడంతో పసిడి ధర 5డాలర్ల నష్టంతో 1,203.50 డాలర్ల వద్ద ముగిసింది. ‘‘ఫెడ్‌ రిజర్వ్‌ వచ్చే డిసెంబర్‌లో వడ్డీరేట్లను పెంచవచ్చనే సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో పసిడి కీలక సాంకేత స్థాయిలన్నీ బలహీనంగా మారాయి. ప్రస్తుతం పసిడికి 1200 డాలర్ల కీలకమైన మద్ధతు స్థాయి ఉంది. ఒకవేళ పసిడి ధర ఆ స్థాయిని కూడా కోల్పోయినట్లైతే 1,180 డాలర్లకి పతనం కావచ్చని మార్కెట్‌ విశ్లేషకుల భావిస్తున్నారు.
దేశీయంగా రూ.31,000ల దిగువకు:-
అంతర్జాతీ మార్కెట్లో పసిడి ధర పతనంతో పాటు, డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం తదితర అంశాల నేపథ్యంలో పసిడి ధర దేశీయంగా రూ.31000 వేల దిగువకు చేరుకుంది. ఉదయం గం.11.30లకు ఎంసీఎక్స్‌లో ఔన్స్‌ పసిడి రూ.87.00లు క్షీణించి రూ.30914.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. రాత్రి ఎంసీఎక్స్‌లో 10గ్రాముల పసిడి ధర రూ.31001ల వద్ద ముగిసింది.



You may be interested

సుగర్‌ షేర్లలో ర్యాలీ..!

Tuesday 13th November 2018

ముంబై: నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సూచీ నిఫ్టీ 50 ప్రస్తుతం 10,450-10,650 శ్రేణిలో కదలాడుతోంది. ఈ ప్రధాన సూచీ కన్సాలిడేషన్‌ దశలోనే ఉన్నప్పటికీ.. పలు పంచదార పరిశ్రమ షేర్లు మాత్రం ర్యాలీకి రెడీగా ఉన్నట్లు టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఎన్‌ఎస్‌ఈలో ట్రేడవుతున్న సుగర్‌ షేర్లలో అత్యధిక శాతం షేర్లలో ర్యాలీ చోటుచేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. మూవింగ్ యావరేజ్‌ కన్వర్జెన్స్ డైవర్జెన్స్ (ఎంఏసీడీ) ఆధారంగా.. బల్‌రాంపూర్ చీనీ మిల్స్‌, త్రివేణి ఇంజనీరింగ్

ఎఫ్‌ఐఐలు ఇష్టపడ్డ స్టాక్స్‌ ఇవే..

Tuesday 13th November 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు సెప్టెంబర్‌ క్వార్టర్‌లో తీవ్ర ఒడిదుడుకులకు గరయ్యాయి. ఒకవైపు సెన్సెక్స్‌ ఆగస్ట్‌ 29న రికార్డ్‌ గరిష్ట స్థాయికి చేరితే.. మరోవైపు విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా దాదాపు రూ.10,000 కోట్లను వెనక్కు తీసుకున్నారు. ఫారిన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్‌లో నికరంగా చూస్తే విక్రయదారులుగా ఉన్నా కూడా.. పలు కంపెనీలు షేర్లను కొనుగోలు చేశారు. ఏస్‌ ఈక్విటీ గణాంకాల ప్రకారం చూస్తే.. గత నాలుగు క్వార్టర్లలో

Most from this category