STOCKS

News


స్థిరంగా పసిడి

Monday 27th August 2018
Markets_main1535346163.png-19661

డాలర్‌ స్వల్ప పతనం కారణంగా ప్రపంచమార్కెట్లో సోమవారం పసిడి ధరలు స్థిరంగా ట్రేడ్‌ అవుతున్నాయి. జాక్సన్ హోల్ ఎకనామిక్ సింపోజియమ్‌లో శుక్రవారం ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్ ప్రసంగిస్తూ ‘‘వడ్డీరేట్లు పెంపు వ్యవస్థలో ఆర్థిక వృద్ధిని మెరుగుపరుస్తుంది. ఒకవేళ వడ్డీరేట్ల పెంపు జాప్యం చేస్తే వ్యవస్థలో స్థిరీకరణ దెబ్బతింటుంది. కాబట్టి క్రమపద్ధతిలోనే వడ్డీ రేట్లను పెంచుతాము. అని అన్నారు. పావెల్ ప్రకటన అనంతరం డాలర్ ఒత్తిడి పెరిగింది. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ స్వల్పంగా బలహీనపడి 95.06ను తాకింది. ఫలితంగా పసిడి ధర సోమవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో పసిడి ఔన్స్‌ ధర భారత్‌లో ఉదయం గం.10:00లకు 0.60 డాలర్లు  స్వల్పంగా నష్టపోయి 1213.30 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. పావెల్‌ ప్రసంగం నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఔన్స్‌ పసిడి 18.30డాలర్లు(1.7శాతం) లాభపడి 1,213.3 డాలర్ల వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. మే 17, 2017 తరువాత ఒక్కరోజులోని పసిడి ఇంత స్థాయిలో పెరగడం ఇదే ప్రథమం.
దేశీయంగానూ స్థిరంగా:-
గత శుక్రవారం రూపాయి రీకవరీతో భారీగా లాభపడిన పసిడి సోమవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఎంసీఎక్స్‌లో సోమవారం 10గ్రాముల పసిడి రూ.10ల స్వల్ప పెరుగుదలతో రూ.29913.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. శుక్రవారం రూపాయి రీకవరీ కారణంగా రూ.281.00లు పెరిగి రూ.29903ల వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.



You may be interested

అన్‌లిస్టెడ్‌ కంపెనీల కొత్త షేర్లు డీమ్యాట్‌ రూపంలోనే !

Monday 27th August 2018

న్యూఢిల్లీ: అన్‌లిస్టెడ్‌ కంపెనీలు ఇక నుంచి జారీచేసే కొత్త షేర్లను డీమెటీరియలైజ్‌డ్‌(డీమ్యాట్‌) రూపంలోనే జారీ చేయాలని త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నది. నల్లధనం నిరోధక చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నదని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు వెల్లడించారు. అంతే కాకుండా అన్‌లిస్టెడ్‌ కంపెనీలు షేర్ల బదిలీని డీమ్యాట్‌ లేదా ఎలక్ట్రానిక్‌ రూపంలోనే బదిలీ చేయాల్సి ఉంటుందని, ఈ మార్పులు అక్టోబర్‌ మొదటి వారం నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయని

ఆర్‌బీఐ ఇచ్చిన పరిష్కార గడువు నేటితో ముగింపు

Monday 27th August 2018

ముంబై: భారీ మొండి బకాయి ఖాతాల (ఎన్‌పీఏలు) విషయంలో ఆర్‌బీఐ విధించిన ఆరు నెలల గడువు సోమవారంతో ముగిసిపోనుంది. సుమారు 70 ఖాతాలకు సంబంధించి రూ.3.8 లక్షల కోట్ల రుణాలకు బ్యాంకులు పరిష్కార ప్రణాళిక సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే వాటిని ఎన్‌సీఎల్‌టీ పరిష్కారానికి నివేదించక తప్పనిసరి పరిస్థితిని బ్యాంకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో బ్యాంకులు చివరి క్షణంలో వీటికి సంబంధించి పరిష్కారం కోసం తమ చర్యల్ని వేగవంతం చేశాయి. ఈ

Most from this category