STOCKS

News


పెరిగిన పసిడి

Wednesday 19th September 2018
Markets_main1537337482.png-20372

డాలర్‌కు డిమాండ్‌ తగ్గడంతో పసిడి ధర బుధవారం ర్యాలీ చేస్తుంది. ఆసియా ట్రేడింగ్‌లో నేటి ఉదయం ఔన్స్‌ పసిడి 6డాలర్ల వరకు లాభపడింది. గతవారంలో చివర నుంచి వర్థమాన దేశాల మార్కెట్ల రికవరీ కారణంగా డాలర్‌కు డిమాండ్‌ తగ్గినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆసియా మార్కెట్లో ఔన్స్‌ పసిడి భారత వర్తమానకాలం ఉదయం 11 గంటలకు ఔన్స్‌ పసిడి 5.50 డాలర్లు లాభపడి 1,208.40 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా విధించిన 200 బిలియన్ డాలర్ల సుంకానికి ప్రతీకారంగా 60 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తుల మీద 10 సుంకాన్ని అదనంగా విధించనున్నట్టు చైనా తెలిపింది. వాణిజ్య యుద్ధ వార్తలు డాలర్‌ పుంజుకోవడానికి సహకరించకపోగా, పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు సహకరించాయి. సాధారణంగా ఇన్వెస్టర్లు వాణిజ్య యుద్ధాల వల్ల అమెరికా తక్కువ నష్టపోతుందనే నమ్మకంతో డాలర్‌ను కొనుగోలు చేస్తుంటారు. అయితే, ప్రస్తుతం డాలర్‌ తగ్గుతున్న డిమాండ్‌ చూస్తుంటే అమెరికా ఆర్థిక వ్యవస్థపై వాణిజ్య యుద్ధ ప్రభావం పడుతుందనే ఆందోళనలు ఇన్వెస్టర్లలో మొదలైనట్లు కనిపిస్తుందని మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు. ‘‘ పసిడి స్వల్ప, మధ్యకాలంలో పసిడి 1,190- 1,210 డాలర్ల రేంజ్‌ బౌండ్‌లో ట్రేడ్‌ అవుతోందని అంచనావేస్తున్నారు.
దేశీయంగా స్వల్ప పెరుగుదల:-
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి పెరుగదలతో పోలిస్తే దేశీయంగా స్వల్పంగా లాభపడింది. డాలర్‌ మారకంలో రూపాయి పెరుగుదల అందుకు కారణమైంది. ఎంసీఎక్స్‌లో నేడు 10గ్రాముల పసిడి రూ.50.00లు లాభపడి రూ.30843.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

మొండిబకాయిల విక్రయంలో ఎస్‌బీఐలు

Wednesday 19th September 2018

8 ఎన్‌పీఏల విక్రయానికి బిడ్ల ఆహ్వానం విలువ సుమారు రూ. 3,900 కోట్లు న్యూఢిల్లీ:- సుమారు రూ. 3,900 కోట్ల మేర మొండిబాకీలను రాబట్టుకునే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మరో 8 నిరర్ధక ఆస్తులను (ఎన్‌పీఏ) విక్రయించనుంది. ఇందుకోసం అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీలు (ఏఆర్‌సీ), ఆర్థిక సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. ఎనిమిది ఖాతాల్లో అత్యధికంగా కోల్‌కతాకు చెందిన రోహిత్ ఫెరో టెక్‌

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 19th September 2018

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు లుపిన్:- కంపెనీ కొత్త సీఈవోగా అలోక్‌ సోనిక్‌ నియమితులయ్యారు. ఎలక్ట్రో స్టీల్‌:- కంపెనీలో వేదాంత వాటా కొనుగోలు అంశానికి సెప్టెంబర్‌ 24న జరిగే బోర్డు సమావేశంలో ఆమోదం తెలపనుంది. సన్‌ ఫార్మా:- సోరియాస్‌ చికిత్సలో ఉపయోగించే ఇల్లూమెట్రి ఔషధాలను యూరప్‌ మార్కెట్లో విక్రయించడానికి యూరోపియన్‌ డ్రగ్‌ కంట్రోల్‌ నుంచి అనుమతినిచ్చింది. టాటా స్టీల్‌:- క్రియేటివ్‌ పోర్ట్‌ డెవెలప్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 51శాతం వాటా కొనుగోలును

Most from this category