STOCKS

News


ఏడాది కనిష్టానికి పసిడి

Wednesday 18th July 2018
Markets_main1531895088.png-18429

ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు అంచనాతో డాలర్‌ పరుగులు...
ముంబై:- ఫెడ్‌ రిజర్వ్‌ కీలకవడ్డీ రేట్ల పెంపుపై స్పష్టత రావడంతో ప్రపంచవ్యాప్తంగా బుధవారం పసిడి ధర ఏడాది కనిష్టానికి పతనమైంది. భారత కాలమానం గం.11:10 ని.లకు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి 1.40 డాలర్ల తగ్గి 1,224.80 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గతరాత్రి అమెరికా కాంగ్రెస్‌ టెస్టిమోని సందర్భంగా ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ మాట్లాడుతూ ‘ రానున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంటుంది. వాణిజ్యయుద్ధం నెలకొన్నప్పటికీ అమెరికా పటిష్టమైన గణాంకాలు సాధిస్తుంది. ఈ ఏడాది ఫెడరల్‌ రిజర్వ్‌ మరో రెండుసార్లు వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉండవచ్చని’ తెలిపారు. కీలకవడ్డీ రేట్ల పెంపుపై స్పష్టత రావడంతో డాలర్‌ ఇండెక్స్‌ పరుగులు పెట్టింది. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో 95 స్థాయిని అధిగమించింది. ప్రస్తుతం 0.21శాతం పెరిగి 95.20ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. మరోవైపు ట్రెజరీ ఈల్డ్స్‌ కూడా పెరిగాయి. ఫలితంగా డాలర్‌ విలువకు అనులోమానుపాతంగా ట్రేడ్‌ అయ్యే పసిడి తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఆసియాలో పలు మార్కెట్లు సానుకూల ట్రేడింగ్‌ కూడా పసిడి ధరలపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇంతక్రితం 2017 జూలై 14న 1214 డాలర్లకు చేరింది.

దేశీయంగా రూ.30వేల దిగువకు:-
ప్రపంచమార్కెట్లలో పసిడి ఏడాది కనిష్ట ధరకు చేరడంతో దేశీయంగా గతరాత్రి ట్రేడింగ్‌లో రూ.30వేల దిగువకు చేరుకుంది.  ఎంసీఎక్స్‌లో బుధవారం 10 గ్రాముల పసిడి ధర రూ.39.00లు తగ్గి రూ.29690.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. క్రితంరోజు రాత్రి ఎంసీఎక్స్‌లో10 గ్రాముల పసిడి ధర రూ.346లు నష్టపోయి రూ.29,734ల వద్ద ముగిసింది. డాలర్‌ మారకంలో రూపాయి క్షీణిస్తున్నప్పటికీ పసిడి విలువ తగ్గుముఖం పడుతోంది.



You may be interested

షేర్ల ధర తగ్గింది.. ప్రమోటార్ల వాటా పెరిగింది..

Wednesday 18th July 2018

దేశీ ఈక్విటీ మార్కెట్‌లో జూన్‌ క్వార్టర్‌లో తీవ్ర ఒడిదుడుకులున్నాయి. మరీముఖ్యంగా మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌లో అస్థిరత ఉండేది. బీఎస్‌ఈ సెనెక్స్‌ 6.5 శాతం పెరిగితే బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు వరుసగా 4.54 శాతం, 7.83 శాతం క్షీణించాయి. జూన్‌ క్వార్టర్‌లో వివిధ రంగాలకు చెందిన 100కిపైగా కంపెనీల ప్రమోటర్లు తమ తమ సంస్థల్లో వాటాలను పెంచుకున్నారు. ప్రమోటార్లు సాధారంగా స్టాక్‌కు వ్యాల్యు ఉన్నా, బిజినెస్‌లో పాజిటివ్‌ చర్య

వర్ధమాన మార్కెట్లపై టెంపుల్టన్‌, బ్లాక్‌రాక్‌ కన్ను...

Wednesday 18th July 2018

వర్ధమాన మార్కెట్లపై టెంపుల్టన్‌, బ్లాక్‌రాక్‌ కన్ను... ప్రపంచపు అతిపెద్ద మనీ మేనేజర్లు ప్రస్తుతం వర్ధమాన మార్కెట్లపై ప్రధానం దృష్టి కేంద్రీకరించారు. వీటిల్లో ఇన్వెస్ట్‌ చేయడానికి రెడీ అవుతున్నారు. ఎమర్జింగ్‌ మార్కెట్లు స్టాక్స్‌లో 7 ట్రిలియన్‌ డాలర్లమైన నష్టపోయాయని, ఇప్పుడు ర్యాలీ చేస్తాయని విశ్వాసంతో ఉన్నారు. గోల్డ్‌మన్‌ శాక్స్‌ గ్రూప్‌, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, బ్లాక్‌రాక్‌ వంటి సంస్థలకు చెందిన ఇన్వెస్టర్లు, వ్యూహాకర్తలు.. చౌక ధరలు, కార్పొరేట్‌ లాభాలు పెరుగుతుండటం, బలమైన ఫండమెంటల్స్‌ వంటి

Most from this category