పెరిగిన పసిడి ధర
By Sakshi

అంతర్జాతీయ మార్కెట్లో గురువారం పసిడి ధర పెరిగింది. ప్రపంచమార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవ్వడం, డాలర్ ఇండెక్స్ తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణమయ్యాయి. ఆసియా ట్రేడింగ్లో భారత వర్తమాన కాల ప్రకారం ఉదయం 10:30ని.లకు ఔన్స్ పసిడి 3.30డాలర్లు పెరిగి 1,196.80 వద్ద ట్రేడ్ అవుతోంది. బుధవారం రాత్రి అమెరికా మార్కెట్లు మూడు నెలల కనిష్టస్థాయికి పడిపోవడంతో, నేడు ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు యెన్ కరెన్సీ నేడు అక్టోబర్ గరిష్టానికి చేరుకోవడంతో ఆరుప్రధాన కరెన్సీల మారకంలో డాలర్ ఇండెక్స్ 95స్థాయికి పతనమైంది. ఫలితంగా పసిడి ఫ్యూచర్లలో కొనుగోళ్లు పెరిగాయి. ఔన్స్ ధర నేటి ఇంట్రాడేలో 5.10డాలర్లు వరకు పెరిగి 1,198.50 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. రాత్రి అమెరికా మార్కెట్లో 1,193.40 వద్ద ముగిశాయి.
దేశీయంగానూ పెరుగుదలే:-
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పెరగడం, డాలర్ మారకంలో రూపాయి కొత్త కనిష్టానికి చేరుకోవడం తదితర కారణాలతో దేశీయంగానూ పసిడి ధర పెరిగింది. ఎంసీఎక్స్ మార్కెట్లో గురువారం 10గ్రాముల పసిడి రూ.126లు పెరిగి రూ.31507ల వద్ద ట్రేడ్ అవుతోంది. బుధవారం ఎంసీక్స్లో 10గ్రాముల పసిడి రూ.31381ల వద్ద ముగిసింది.
You may be interested
మార్కెట్లలో మహా పతనం
Thursday 11th October 2018ప్రపంచవ్యాప్తంగా ఢమాల్మంటున్న ఈక్విటీలు ట్రేడ్ వార్ టెన్షన్స్, ఫెడ్ రేట్లు కారణాలంటున్న నిపుణులు బుధవారం అమెరికా మార్కెట్లలో ఆరంభమైన మార్కెట్ మంటలు ప్రపంచ మార్కెట్లన్నింటికీ వ్యాపించాయి. ఆస్ట్రేలియా నుంచి ఇండియా వరకు ఆసియా మార్కెట్లన్నీ గురువారం భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 200 సూచీ 2 శాతం, జపాన్ నికాయ్ 4.4 శాతం, హాంకాంగ్ హ్యాంగ్సాంగ్ 3.7 శాతం, చైనా షాంఘై 4.4 శాతం, తైవాన్ టీఎస్ఈసీ సూచీ 6.3 శాతం
రెండు వారాల కనిష్టానికి ముడిచమురు ధర
Thursday 11th October 2018అంతర్జాతీయంగా ముడిచమురు ధర గురువారం రెండువారాల కనిష్టానికి చేరుకుంది. గతరాత్రి అమెరికా మార్కెట్లో 2.25శాతం నష్టపోయిన చమురు ధర గురువారం ట్రేడింగ్లో మరింత నష్టపోయింది. ప్రపంచమార్కెట్లో నేడు బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ఫ్యూచర్ ధర 1.77 శాతం నష్టపోయి 81.60డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నేటి ఇంట్రాడేలో 1.72 డాలర్ల వరకు నష్టపోయి 81.37డాలర్ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. ఇది చమురు ధరకు రెండువారాల కనిష్టస్థాయి. అమెరికా