STOCKS

News


అక్కడక్కడే పసిడి

Tuesday 11th September 2018
Markets_main1536641018.png-20143

క్రితంరోజు 1200 డాలర్ల దిగువన ట్రేడైన పసిడి ధర మంగళవారం కూడా అక్కడక్కడే కదులుతోంది. ఫెడరల్‌ వడ్డీరేట్ల పెంపు భయాలు, అమెరికా - చైనా దేశాల మధ్య తొలగని వాణిజ్య యుద్ధ భయాలు ఇందుకు కారణమవుతున్నాయి. నేడు ఆసియా మార్కెట్లో భారతవర్తమాన కాలం ఉదయం10 గంటలకు ఔన్స్‌ పసిడి 0.70 డాలర్లు నష్టపోయి రూ.1,199.00 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గత శుక్రవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చైనా నుంచి దిగుమతయ్యే అన్ని వస్తువులపై సుంకాలను విధించే యోచనలో ఉన్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో అగ్రరాజ్యాలైన అమెరికా-చైనా దేశాల మధ్య మరోసారి వాణిజ్య యుద్ధం మొదలైనట్లేనని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఈ సెప్టెంబర్‌లో జరిగే ఫెడ్‌ రిజర్వ్‌ సమావేశంలో ఫెడ్‌ కీలక వడ్డీరేట్లు పెంచవచ్చనే అంచనాలు బలపడ్డాయి. ఫలితంగా పసిడి ట్రేడింగ్‌పై ప్రభావితం చేసే డాలర్‌ ఇండెక్స్‌ 95 స్థాయిపైన స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నేడు డాలర్‌ ఇండెక్స్‌ విలువ ఆరు ప్రధాన కరెన్సీ పోలిస్తే 95.23 స్థాయి వద్ద ట్రేడ్‌ అవుతోంది. గతరాత్రి అమెరికా  మార్కెట్లు సోమవారం మిశ్రమ ముగింపు నేపథ్యంలో అక్కడ ఔన్స్‌ పసిడి 1,199.8 డాలర్ల వద్ద ముగిశాయి.
రూపాయి రికవరీ- పతనమైన పసిడి:-
అంతర్జాతీయంగా పసిడి ధర అక్కడక్కడే ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., దేశీయంగా రూపాయి రికవరీ కారణంగా మంగళవారం ఎంసిఎక్స్‌లో పసిడి నష్టాల బాట పట్టింది. ఎంసీఎక్స్‌లో నేడు 10గ్రాముల పసిడి రూ.154.00లు నష్టపోయి రూ.30561.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కిత్రం ట్రేడింగ్‌లో రూపాయి 72 పైసలు నష్టపోవడంతో రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగింపు సమయానికి 10గ్రాముల పసిడి రూ.231.00లు లాభపడి రూ.30715.00 వద్ద ముగిసింది.



You may be interested

36 క్లిష్ట ఆరోగ్య సమస్యలకు పాలసీ

Tuesday 11th September 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: బీమా రంగ సంస్థ బజాజ్‌ అలియంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌... సోమవారం కొత్త​పాలసీని ప్రవేశపెట్టింది. బజాజ్‌ అలియంజ్‌ లైఫ్‌ హెల్త్‌ కేర్‌ గోల్‌ పేరుతో రూపొందిన ఈ పాలసీ 36 రకాల క్లిష్ట ఆరోగ్య సమస్యలను కవర్‌ చేస్తుంది. ఒక ప్రీమియంతో ఒకే పాలసీ కింద ఆరుగురు సభ్యులున్న కుటుంబం లబ్ది పొందవచ్చు. రూ.5 లక్షల పాలసీ తీసుకుంటే ఒక్కొక్కరికి రూ.5 లక్షల కవరేజ్‌ ఉంటుంది. సంప్రదాయ

వచ్చే పదేళ్లూ ఆకాశమే హద్దు

Tuesday 11th September 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ‘‘అమెరికా జనాభా 33 కోట్లు. కానీ, అక్కడ వాణిజ్య విమానాల సంఖ్య 5 వేలు. ఇండియా జనాభా 120 కోట్లకు పైనే. కానీ, ఇక్కడ సేవలందిస్తున్న విమానాలు జస్ట్‌ 500–600 మాత్రమే! అమెరికాతో పోలిస్తే నాలుగు రెట్ల జనాభా ఎక్కువున్న ఇండియాలో పది రెట్ల విమానాలు తిరగాల్సిన అవసరముంది. ఇదే దేశీ విమాన కంపెనీలకు వ్యాపార అవకాశాలను కల్పిస్తుంది’’ అని ఇండిగో డిసిగ్నేటెడ్‌ సీఈఓ గ్రేగొరీ

Most from this category