STOCKS

News


స్థిరంగా పసిడి ధర

Friday 10th August 2018
Markets_main1533877409.png-19112

ట్రేడ్‌ వార్‌తో అంతర్జాతీయ మార్కెట్లో శుక్రవారం పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో పసిడి ఔన్స్‌ ధర శుక్రవారం భారత కాలమానం ప్రకారం గం.10:00 ని.లకు 0.30 డాలర్లు స్వల్ప పెరుగుదలతో 1,220.20 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గత రాత్రి అమెరికా మార్కెట్ల ఫ్లాట్‌ ముగింపు కారణంగా అక్కడ పసిడి బలపడింది. అయితే నేటి ఉదయం యూఎస్‌-చైనా ట్రేడ్ వార్‌ భయాల కారణంగా ఆసియాలో పలు మార్కెట్ల మిశ్రమ ట్రేడింగ్‌ పసిడి ధరకు బలాన్నిస్తుంది. సాదారణంగా యుద్ధ భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు మొగ్గు చూపుతారు. అయితే పసిడి మరింత లాభపడకుండా డాలర్‌ పటిష్టమైన ర్యాలి అడ్డుకట్ట వేస్తుంది.  నేడు డాలర్‌ ఇండెక్స్‌ 0.04శాతం లాభపడి 95.54 స్థాయి వద్ద కదలాడుతోంది. పసిడి ధరకి 1,220డాలర్ల వద్ద పటిష్టమైన మద్ధతు ధర ఉంది. ఈ స్థాయిని కోల్పోవాలంటే ట్రేడ్‌వార్‌ యుద్ధ భయాలు తగ్గుముఖం పట్టాలి. అలాగే డాలర్‌ కూడా మరింత ర్యాలీ చేయాల్సి ఉంటుందని మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు.  క్రితం రాత్రి అమెరికా మార్కెట్ల ఫ్లాట్‌ముగింపు కారణంగా అక్కడ మార్కెట్లో ఔన్స్‌ పసిడి 1,219.9 డాలర్ల వద్ద ముగిసింది.
దేశీయంగానూ అదే ధోరణి:-
అంతర్జాతీయంగా ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయంగానూ పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఎంసీఎక్స్‌లో శుక్రవారం 10 గ్రాముల పసిడి ధర రూ.4లు స్వల్పంగా తగ్గి రూ.29664.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. క్రితం రాత్రి ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి ధర రూ.51లు పెరిగి రూ.29688ల వద్ద ముగిసింది.



You may be interested

ఎస్‌బీఐ ఫలితాలు.. ఎలా ఉండొచ్చు?

Friday 10th August 2018

క్యు1 ఫలితాలపై అంచనాలు దేశీయ ప్రభుత్వ బ్యాంకు దిగ్గజం ఎస్‌బీఐ క్యు1 ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో షేరు దాదాపు 2 శాతం పతనమైంది. గత నెల రోజుల్లో ఈ షేరు సుమారు 19 శాతం ర్యాలీ జరిపింది. గడిచిన మూడు రోజుల్లోనే 3 శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో బ్యాంకు ఫలితాలపై మార్కెట్‌ అంచనాలు ఇలా ఉన్నాయి... - రాయిటర్స్‌ పోల్‌ ప్రకారం కేటాయింపులు

రూపాయి డౌన్‌...

Friday 10th August 2018

68.83 వద్ద ప్రారంభం గురువారం ముగింపు 68.68తో పోలిస్తే 0.24 శాతం తగ్గుదల ఇండియన్‌ రూపాయి శుక్రవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే బలహీనపడింది. అమెరికా, ఇతర దేశాల మధ్య నెలకొని ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా ప్రధాన కరెన్సీలు నష్టాల్లో ఉండటం ఇందుకు కారణం. ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 68.84 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తన మునపటి ముగింపు 68.68తో పోలిస్తే 0.24 శాతం క్షీణించింది. ఇక

Most from this category