STOCKS

News


3నెలల గరిష్టం వద్ద పసిడి

Wednesday 24th October 2018
Markets_main1540359471.png-21416

ప్రపంచమార్కెట్లో పసిడి ధర బుధవారం 3నెలల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో భారత వర్తమానకాల ప్రకారం ఉదయం గం.10:00ని.లకు ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్పంగా తగ్గి 1236.30 వద్ద ట్రేడ్‌ అవుతోంది. గత రోజు అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, రాజకీయ అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో ఔన్స్‌ పసిడి 1,242.80 డాలర్ల వరకు పెరిగి మూడు నెలల గరిష్టాన్ని తాకింది. చివరకు రాత్రి అమెరికా మార్కెట్లో 1,236.80 వద్ద ముగిసింది. నేడు ఆసియా ట్రేడింగ్‌లో 1,236.20 డాలర్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. డాలర్‌ ఇండెక్స్‌ రీవకరి కారణంతో పాటు పసిడి ఫ్యూచర్లలో స్వల్పలాభాల స్వీకరణ కారణంగా ఇంట్రాడేలో 2.00 డాలర్ల వరకు తగ్గి 1,234.80డాలర్ల స్థాయికి పతనమైంది.
దేశీయంగా తగ్గుదల:-
డాలర్‌ మారకంలో రూపాయి బలపడంతో దేశీయం పసిడి ధర తగ్గుముఖం పట్టింది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో నేడు 10గ్రాముల పసిడి ధర రూ.89.00లు తగ్గి రూ.31975.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి 3నెలల గరిష్టానికి చేరుకున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి  ఇక్కడ ఎంసీఎక్స్‌లో 10గ్రాముల పసిడి ధర రూ.32వేల పైన రూ.32064 వద్ద ముగిసింది.



You may be interested

ఇక ఫండ్‌ మేనేజర్‌ పాత్రలో ఈపీఎఫ్‌ఓ!

Wednesday 24th October 2018

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థకు (ఈపీఎఫ్‌వో) మరిన్ని బాధ్యతలు అప్పగించాలని కేంద్రం భావిస్తోంది. ప్రైవేటు రంగంలోని 6 కోట్ల మంది సభ్యుల భవిష్యనిధి పెట్టుబడులను నిర్వహిస్తున్న ఈపీఎఫ్‌వోకు... మిగిలిన సామాజిక భద్రతా పథకాల నిధుల నిర్వహణను కూడా అప్పగించాలన్నది కేంద్రం ఆలోచన. ఇందుకోసం ఈపీఎఫ్‌వోను ఫండ్‌ మేనేజర్‌గా మార్చాలనుకుంటోంది. తద్వారా దేశంలో 50 కోట్ల మందికి సామాజిక భద్రతను అందించే గురుతర బాధ్యతను దానిపై మోపాలన్నది కేంద్రం యోచనగా తెలియవచ్చింది.

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 24th October 2018

ముంబై:- వివిధ వార్తలను అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు వీఏ టెక్‌ వాబాగ్‌:- ఖతార్‌ దేశం నుంచి రూ.555 కోట్ల ఆర్డర్లను దక్కించుకుంది. సన్‌ ఫార్మా:- సోరియాసిస్‌ చికిత్సలో వినియోగించే ఇలూమియా ఔషధాలను అమెరికా మార్కెట్లో విడుదల చేసింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా:- రూ.11 కోట్ల విలువైన 95 మెండి బకాయిల అకౌంట్లను విక్రయించింది. భారతి ఎయిర్టెల్‌:- ఆఫ్రికా యూనిటల్‌ ద్వారా రూ.1.25 కోట్లను సమీకరించింది. డీసీఎం శ్రీరామ్‌:- రాజస్థాన్‌ యూనిట్‌లో వాణిజ్య ఉత్పత్తులను ప్రారంభించింది. జైపీ

Most from this category