STOCKS

News


తగ్గిన పసిడి

Thursday 8th November 2018
Markets_main1541652732.png-21783

ముంబై:- డాలర్‌ ఇండెక్స్‌ రీకవరీ, ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ కారణంగా గురువారం పసిడి ధర నష్టాల బాట పట్టింది. ఆసియా ట్రేడింగ్‌లో గురువారం భారత వర్తమానకాలం ప్రకారం మధ్యాహ్నం గం.9.40లకు ఔన్స్‌ పసిడి 5.00 డాలర్లు నష్టపోయి 1,223.70 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. రాత్రి అమెరికా మార్కెట్ల లాభాల ముగింపును అందిపుచ్చుకున్న ఆసియా మార్కెట్లు నేటి ట్రేడింగ్‌ ర్యాలీ చేస్తున్నాయి. మరోవైపు డాలర్‌ ఇండెక్స్‌ నాలుగు రోజుల నష్టాల నుంచి రీకవరీ బాట పట్టింది. నిన్నటి ట్రేడింగ్‌లో డాలర్‌ ఇండెక్స్‌ కోల్పోయిన 96 స్థాయిని తిరిగి అందుకుంది. ప్రస్తుతం ఆరు ప్రధాన కరెన్సీ విలువలతో పోలిస్తే డాలర్‌ ఇండెక్స్‌ 96.06 స్థాయి వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) రెండు రోజుల పరపతి సమీక్షా సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. నేడు ముగియనున్న ఈ సమావేశాల్లో వడ్డీరేట్లపై ఫెడ్‌ రిజర్వ్‌ వైఖరి స్పష్టమవుతోంది. ఈసారి కూడా ఫెడ్‌ వడ్డీరేట్లను పెంచేందుకే మొగ్గుచూపుతుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు ఆసియా ట్రేడింగ్‌లో పసిడి ధర నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది.
దేశీయంగా స్వల్ప నష్టాల ముగింపు:-
సంవత్‌ 2075 ప్రారంభపు రోజు జరిగిన గంటపాటు జరిగిన ముహూరత్ ట్రేడింగ్‌లో పసిడి ధర స్వల్పంగా నష్టపోయింది. బుధవారం రాత్రి ఫారెక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ.57.00లు నష్టపోయి రూ.31589.00ల వద్ద ముగిసింది.



You may be interested

ఆఫ్‌షోర్‌లో రూపీ రివకరీ

Thursday 8th November 2018

ఇండియన్‌ రూపాయి ఆఫ్‌షోర్‌ మార్కెట్‌లో కోలుకుంది. ఏకంగా 68 పైసలు మేర లాభపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ గురువారం ఉదయం 10:23 సమయంలో (భారతీయ కాలమాన ప్రకారం) 72.32 వద్ద ట్రేడవుతోంది. ఒకానొక సమయంలో 72.30 స్థాయికి కూడా బలపడింది. కాగా రూపాయి మంగళవారం 73 వద్ద ముగిసింది. దీంతో దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే శుక్రవారం రూపాయి పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశముంది. కాగా రూపాయి

ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ అప్‌..

Thursday 8th November 2018

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ బుధవారం లాభాల్లో ట్రేడయ్యాయి. ఒక్క విప్రో మినహా మిగతా అన్ని స్టాక్స్‌ ఏడీఆర్‌లు పెరిగాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌లు ఎక్కువ వ్యాల్యుమ్స్‌తో పెరిగాయి. ఇక వేదాంత ఏడీఆర్‌లో ఎక్కువ వృద్ధి కనిపించింది. విప్రో ఏడీఆర్‌ స్వల్పంగా తగ్గింది. టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 1.31 శాతం లాభంతో 13.18 డాలర్లకు పెరిగింది. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 1.37

Most from this category