STOCKS

News


ట్రేడ్‌వార్‌తో పసిడి పరుగు

Wednesday 8th August 2018
Markets_main1533708126.png-19044

ముంబై:- అమెరికా - చైనాల మధ్య వాణిజ్య వివాదాలు ముదురుతున్న తరుణంలో పసిడి ధర పుంజుకుంది. ఆసియా ట్రేడింగ్‌లో పసిడి ఔన్స్‌ ధర బుధవారం భారత కాలమానం ప్రకారం గం.10:45 ని.లకు 3.40 డాలర్లు పెరిగి 1,221.70 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆగస్ట్‌ 23 నుంచి 16 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై 25 శాతం సుంకాలను విధిస్తామని మంగళవారం అమెరికా మరోసారి ప్రకటించింది. ఇక పసిడిపై ప్రభావాన్ని చూపే డాలర్‌ ఆరు ప్రధాన కరెన్సీ విలువతో పోలిస్తే బుధవారం తగ్గుముఖం పట్టింది. క్రితం రోజు అందుకున్న మూడు గరిష్టస్థాయి(95.35) కోల్పోడం పసిడి పెరుగుదలకు కలిసొచ్చింది. మరోవైపు ఇరాన్‌ అణు కార్యక్రమాలపై అమెరికా ఆంక్షలు విధింపు అంశం కూడా పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు మద్దతునిస్తున్నాయి. అల్ఫాబెట్‌, అమేజాన్‌, మైక్రోసాఫ్ట్‌, టెస్లా కంపెనీ షేర్ల ర్యాలీ అండతో గతరాత్రి అమెరికా స్టాక్‌ మార్కెట్ల ముగింపు కారణంగా అక్కడ పసిడి  1,218.30 వద్ద ముగిసింది.
దేశీయంగానూ పసిడి అదే ధోరణి:-
అంతర్జాతీయంగా ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయంగానూ పసిడి ధర పుంజుకుంది. ఎంసీఎక్స్‌లో బుధవారం 10 గ్రాముల పసిడి ధర రూ.70లు లాభపడి రూ.29667.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. క్రితం రాత్రి ఎంసీఎక్స్‌లో రూ.29487ల వద్ద ముగిసింది.

 



You may be interested

11800 పాయింట్లకు నిఫ్టీ!

Wednesday 8th August 2018

యస్‌ సెక్యూరిటీస్‌ అంచనా గతవారం ర్యాలీ అనంతరం ఈ వారం సూచీలు మందకొడిగా సాగుతున్నాయి. బుధవారం నిఫ్టీ మరో రికార్డు స్థాయిని తాకినా మెజార్టీ షేర్లలో కదలికలు లేవు. నిఫ్టీ క్రమంగా ట్రేడింగ్‌ ఛానెల్‌ పైఅవధి 11500 పాయింట్ల దిశగా కదులుతోంది. నిఫ్టీ ఈ స్థాయిని దాటి 11530 పాయింట్ల పైన స్థిరంగా కొనసాగితే త్వరలో 11800 పాయింట్లను చేరుకుంటుంది. ఒకవేళ 11270 పాయింట్ల మద్దతు కోల్పోతే మాత్రం క్రమంగా 11170-

28,000 పైన బ్యాంక్‌ నిఫ్టీ

Wednesday 8th August 2018

బ్యాంక్‌ నిఫ్టీ బుధవారం మార్నింగ్‌ సెషన్‌లో 28,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. బ్యాంక్‌ నిఫ్టీ తన మంగళవారం నాటి ముగింపు 27,876 పాయింట్లతో పోలిస్తే బుధవారం 55 పాయింట్ల లాభంతో 27,930 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. తర్వాత ఉదయం 10:51 సమయంలో బ్యాంక్‌ నిఫ్టీ 141 పాయింట్ల లాభంతో 28,017 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఒకానొక సమయంలో 52 వారాల గరిష్ట స్థాయి 28,024 పాయింట్లను కూడా తాకింది.  బ్యాంక్‌ నిఫ్టీలోని

Most from this category