STOCKS

News


పసిడి @ 1300 డాలర్లు

Friday 4th January 2019
Markets_main1546581424.png-23406

కొత్త ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో శుక్రవారం పసిడి ధర తొలిసారి 1300 డాలర్లను తాకింది. ఆసియాలో ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 5.55డాలర్లు పెరిగి 1,300.35 డాలర్ల గరిష్టాన్ని తాకింది. యెన్‌ మారకంలో డాలర్‌ బలహీనత, ఆర్థిక ఆర్థికాభివృద్ధి మందగమనంతో ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి, బాండ్‌ ఈల్డ్‌ పతనం, ఫెడ్‌ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు పసిడి ర్యాలీకి తోడ్పాటును అందించాయి. ఉదయం గం:10:45ని.లకు ఆసియాలో ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 2.45 డాలర్ల లాభపడి 1,297.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. పసిడి ధర 1325 డాలర్ల ర్యాలీకి సిద్దమైంది. ఇప్పటికి పసిడి ధర బుల్లిష్‌గా ఉంది. అయితే గరిష్టస్థాయిల వద్ద లాభాల స్వీకరణకు గురయ్యే ప్రమాదం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక నిన్నటి ట్రేడింగ్‌లో పసిడి ధర ఏకంగా 13డాలర్ల వరకు ర్యాలీ చేసింది. ఆర్థికాభివృద్ధి మందగమనంతో ఐఫోన్ల అమ్మకాలు నీరసించవచ్చని యాపిల్‌ ఆదాయ అంచనాలలో కోతపెట్టింది. డిసెంబర్‌ త్రైమాసికంలో మొత్తం ఆదాయం 84 బిలియన్‌ డాలర్లకు పరిమితం కావచ్చని యాపిల్‌ గైడ్సెన్స్‌ ప్రకటించింది. మరోవైపు డిసెంబర్‌లో అమెరికా తయారీ రంగం రెండేళ్ల కనిష్టానికి పతమైనట్లు ఐఎస్‌ఎం గణాంకాలు వెల్లడించడంతో రాత్రి అమెరికా మార్కెట్లు 3శాతం క్షీణించాయి. ఈక్విటీ మార్కెట్లు పతనంతో పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ పెరగడంతో రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 13 డాలర్లు వరకు ర్యాలీ చేసి 1,294.80 డాలర్ల వద్ద ముగిసింది.
దేశీయ మార్కెట్లో స్థిరంగా పసిడి ధర:-
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ర్యాలీ చేస్తున్నప్పటికీ.., దేశీయ మార్కెట్లో పసిడి ధర స్థిరంగా ర్యాలీ చేస్తుంది. డాలర్‌ మారకంలో రూపాయి రికవరీ అందుకు కారణమవుతుంది. ఎంసీక్స్‌ మార్కెట్లో ఉదయం 11:00నిల.కు 10గ్రాముల పసిడి ధర కేవలం రూ.1లు లాభపడి రూ.31790.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

రూపాయి జోరు... ఐటీ షేర్ల బేజారు..!

Friday 4th January 2019

డాలర్‌ మారకంలో రూపాయి విలువ జోరుతో శుక్రవారం ఐటీ షేర్లు బేజారెత్తుతున్నాయి. నేడు ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి గతముగింపు(70.17)తో పోలిస్తే 21 పైసలు బలపడి 70 స్థాయికి దిగువున 69.96 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో ముడిచమురు ధరలు పతనం, డాలర్‌ బలహీనత తదితర కారణాలతో నేటి ఉదయం ట్రేడింగ్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 31 పైసలు బలపడింది. రూపాయి ర్యాలీ డాలర్‌ మారకంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ షేర్లను

అనధికార డిపాజిట్‌ పథకాలపై ఉక్కుపాదం

Friday 4th January 2019

 కఠిన చర్యలకు పార్లమెంటరీ కమిటీ సిఫారసు న్యూఢిల్లీ: అనధికార డిపాజిట్‌ పథకాలు, ఇందుకు కారకులపై కఠిన చర్యలకు రంగం సిద్ధం అవుతోంది. అన్‌రెగ్యులేటెడ్‌ డిపాజిట్‌ స్కీమ్స్‌ నిషేధ బిల్లులోని నిబంధనలను మరింత కఠినతరం చేయాలని ఎం వీరప్ప మొయిలీ నేతృత్వంలోని 31 సభ్యుల కమిటీ సిఫారసు చేసింది. ఈ మేరకు తమ సిఫారసులను పార్లమెంటుకు సమర్పించింది. అమాయకులైన ఇన్వెస్టర్లు మోసపూరిత డిపాజిట్‌ స్కీమ్‌లతో మోసపోకుండా తగిన చర్యలు ఉండాలన్నది ఈ సిఫారసుల

Most from this category