STOCKS

News


5వ నెల పతనమే..!

Saturday 1st September 2018
Markets_main1535795496.png-19879

ప్రపంచమార్కెట్లో పసిడి ధర వరుసగా 5వ నెలలో పతనమైంది. గత శుక్రవారంతో ముగిసిన ఆగస్ట్‌ నెలలో ఔన్స్‌ పసిడి 2.2శాతం మేర నష్టపోయింది. 2013 తరువాత పసిడి వరుసగా 5వనెలలో నష్టపోవడం ఇదే తొలిసారి. ఈ ఆగస్ట్‌లో డాలర్‌ ఇండెక్స్‌ ఏడాదిన్నర గరిష్టానికి చేరుకోవడం, టర్కీ సంక్షోభం, ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు భయాలు పసిడి పతనానికి కారణమయ్యాయి. ఈ ప్రతికూలాంశాల నేపథ్యంలో ఆగస్ట్‌ 16న నాటికి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ పసిడి 1,159.96 డాలర్ల చేరుకుంది. అయితే ఇదే నెలలో కీలక వడ్డీరేట్ల పెంపు విషయంలో ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ వాఖ్యలు, చైనా- అమెరికా దేశాల మధ్య వాణిజ్య యుద్ధభయాలు పసిడి ధరని తిరిగి కోలుకునేలా చేశాయి. ఇక వారం పరంగా చూస్తే పసిడి(0.5శాతం) ఈ వారంలో 21డాలర్ల మేర నష్టపోయింది. ఈ వారంలో గురువారం అత్యధికంగా నష్టపోయింది. శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్ల మిశ్రమ ముగింపు నేపథ్యంలో అక్కడ మార్కెట్లో ఔన్స్‌ పసిడి 1.90డాలర్లు లాభపడి 1206 డాలర్ల వద్ద ముగిసింది. అమెరికా ఆర్థిక గణంకాలు వెల్లడి నేపథ్యంలో ఫెడ్‌ వడ్డీరేట్లకు మొగ్గుచూపువచ్చనే అంచానాలు డాలర్‌ ఇండెక్స్‌ బలపడటానికి కారణమవుతోంది. ఫలితంగా పసిడి ఫ్యూచర్లలో అమ్మకాలు మరికొంత కాలం జరగవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు.
దేశీయంగా రెండో వారం పెరుగుదల:-
పండుగ సీజన్‌ సందర్భంగా స్థానికంగా పసిడి ఆభరణాలకు డిమాండ్‌ పెరగడంతో దేశీయంగా పసిడి రెండో వారంలోనూ ర్యాలీ చేసింది. ఈ రెండు వారాల్లో  10గ్రాముల పసిడి 3.17శాతం(రూ.935)వరుకు లాభపడింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఒడిదుడుకుల నేపథ్యంలో ఈ వారం ప్రారంభంలో రూ.30వేల మార్కును కోల్పోయిన పసిడి డాలర్‌ మారకంలో రూపాయి జీవితకాల కనిష్టానికి పతనమవుతున్న నేపథ్యంలో తిరిగి ఈ స్థాయిని కోరుకోవడం విశేషం. శుక్రవారం రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగింపు సమయానికి 10గ్రాముల పసిడి రూ.41లు స్వల్పంగా నష్టపోయి రూ.30129.00ల వద్ద ముగిసింది. డాలర్‌ మారకంలో రూపాయి జీవితకాల కనిష్టానికి పతనం కావడం, దేశీయంగా స్థానిక రిటైల్‌ వ్యాపారుల నుంచి డిమాండ్‌ పెరగడం తదితర కారణాలతో పసిడి మరింత ర్యాలీ చేయాల్సింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో పసిడి వరుసగా 5నెల నష్టపోవడంతో పసిడి ర్యాలీని చేయలేకపోయిందని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు.



You may be interested

సిమెంట్‌ స్టాక్స్‌కు మంచి రోజులు!!

Saturday 1st September 2018

సిమెంట్‌ పరిశ్రమకు రానున్నది మంచి కాలమే. దీని వల్ల పరిశ్రమ సంబంధిత స్టాక్స్‌ మంచి పనితీరు కనబర్చవచ్చు. ప్రసుత్తం ఈ రంగం కన్సాలిడేట్‌ అవుతూ వస్తోంది. భారత్‌లో సిమెంట్‌ డిమాండ్‌ ప్రధానంగా హౌసింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, కమర్షియల్‌, ఇండస్ట్రీయల్‌ అనే నాలుగు విభాగాల నుంచి ఉంటుంది. అందుబాటు గృహాలు, రూరల్‌ హౌసింగ్‌ విభాగాల నుంచి సిమెంట్‌ డిమాండ్‌ పెరుగుతుందనే అంచనాలున్నాయి. అలాగే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ విభాగం నుంచి రోడ్లు, ఇరిగేషన్‌ ప్రాజెక్టుల ద్వారా

లాంగ్‌టర్మ్‌ ఔట్‌పర్ఫార్మర్‌: సియారామ్‌ సిల్క్‌

Saturday 1st September 2018

బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా సియారామ్‌ సిల్క్‌ మిల్స్‌పై బుల్లిష్‌గా ఉంది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: సెంట్రమ్‌ స్టాక్‌: సియారామ్‌ సిల్క్‌ మిల్స్‌ రేటింగ్‌: లాంగ్‌టర్మ్‌ ఔట్‌పర్ఫార్మర్‌ ప్రస్తుత ధర: రూ.557 టార్గెట్‌ ప్రైస్‌: రూ.674 రిటర్న్‌ అంచనా: 21 శాతం బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా సియారామ్‌ సిల్క్‌ మిల్స్‌పై పాజిటివ్‌గా ఉంది. దీర్ఘకాలానికి స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఔట్‌పర్ఫార్మర్‌ రేటింగ్‌ను ఇచ్చింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.674గా నిర్ణయించింది. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి

Most from this category