News


పసిడిలో లాభాల స్వీకరణ

Monday 10th June 2019
Markets_main1560147602.png-26189

ప్రపంచమార్కెట్లో సోమవారం పసిడి ఫ్యూచర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. నేడు ఆసియాలో 15డాలర్లు నష్టపోయి 1331 డాలర్ల కనిష్టస్థాయికి పతనమైంది. నేడు చైనా విడుదల చేసిన బలమైన వాణిజ్య మిగులు గణాంకాలు, అమెరికా - మెక్సికోల మధ్య వాణిజ్య చర్చలు సఫలమయ్యే దిశగా సాగుతుండటంతో ఇన్వెస్టర్లు  నేడు ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు. క్రితం వారం ట్రేడింగ్‌లో పసిడి ధర 14నెలల గరిష్టానికి చేరుకున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడం కూడా పసిడి పతనానికి కారణమైంది. అయితే ఈసారి ఫెడ్‌రిజర్వ్‌ వడ్డీరేట్లపై తగ్గింపు ఉండవచ్చనే అంచనాలు పసిడికి సానుకూలాంశంగా మారింది. ఈ రోజు పసిడి ధర పతనం జరిగినప్పటికీ, ఈ ఏడాదిలో పసిడి ధర 1400డాలర్ల స్థాయిని అందుకుంటుందని కొందరు బులియన్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
దేశీయంగా రూ.262ల నష్టం:- 
అంతర్జాతీయంగా పసిడి పతనంతో దేశీయ బులియన్‌ మార్కెట్లోనూ పసిడికి నష్టాల బాట పట్టింది. నేడు ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ.262.00లు నష్టపోయి రూ.32674.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి బలహీన ట్రేడింగ్‌ సైతం పసిడికి ప్రతికూలంగా మారింది. గతవారం చివరి ట్రేడింగ్‌ సెషన్‌లో రూ.32936.00ల వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. 



You may be interested

ఎఫ్‌పీఐలు ఏం కొంటున్నారు!

Monday 10th June 2019

విదేశీ సంస్థాగత మదుపరులు దేశీయ మార్కెట్లో నాణ్యమైన మిడ్‌క్యాప్స్‌లో ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా ఎఫ్‌ఐఐలు తాము పెట్టుబడులు పెట్టదలిచిన కౌంటర్లలో ఇతర ఇన్వెస్టర్లు మేల్కొనే ముందే పెట్టుబడులు పెడతారు. వివిధ రంగాలు, ప్రాంతాల్లో ట్రెండ్స్‌ను ముందే పసిగడతారు. దీర్ఘకాలిక సంపద సృష్టికి వీరు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. అందువల్ల వీరు ఎందులో పెట్టుబడులు పెట్టాయో పరిశీలించి మదుపరులు తమ పోర్టుఫోలియోలో సదరు స్టాకులను చేర్చుకుంటుంటారు. గత ఏడాది కాలంలో

సోమవారం వార్తల్లో షేర్లు

Monday 10th June 2019

వివిధ వార్తలకు అనుగుణంగా ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  ఎస్‌బీఐ:-  జూన్‌ 1 నుంచి సవరించిన రెపోరేటును గృహరుణాలకు బదలాయించనుంది.  హెచ్‌ఢీఎఫ్‌సీ బ్యాంక్‌:- ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను యధాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది.  భారత్‌ ఫోర్జ్‌:- జర్మన్‌ కంపెనీ రెఫ్‌ ఎలక్ట్రానిక్‌తో కలిసి జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ఈ జాయింట్‌లో భారత్‌ ఫోర్జ్‌ మొత్తం వాటా 50శాతంగా ఉంటుంది.  మెయిల్‌:- మధ్యప్రదేశ్‌లోని యుక్వా మైన్‌లో పనులు ప్రారంభించేందుకు ఎన్విరాల్‌మెంట్‌ క్లియరెన్స్‌ దక్కించుకుంద.ఇ  ఎల్‌ అండ్‌ టీ:- మైండ్‌ ట్రీలో 5.13శాతం

Most from this category