STOCKS

News


పసిడిలో లాభాలో స్వీకరణ

Saturday 5th January 2019
Markets_main1546670463.png-23420

ప్రపంచమార్కెట్లో పసిడి ధర 7నెలల గరిష్టస్థాయి వద్ద లాభాల స్వీకరణకు లోనైంది. ఆర్థిక వృద్ధి మందగమనతో పలు ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న అస్థితరతో  పసిడి ధర క్రితం ట్రేడింగ్‌లో 7నెలల గరిష్టాన్ని(1300డాలర్లు)తాకిన సంగతి తెలిసిందే. అమెరికా నిరుద్యోగాల గణాంకాలు విశ్లేషకుల అంచనాలను మించి రెట్టింపు నమోదుకావడంతో రాత్రి అమెరికా ఈక్విటీ మార్కెట్లు 3శాతానికి పైగా లాభపడ్డాయి. మరోవైపు ఫెడ్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ కీలక వడ్డీరేట్లపై మెతక వైఖరీ వాఖ్యలతో అమెరికా బాండ్‌ ఈల్డ్‌ గణనీయంగా పెరిగింది. ఈ అంశాలు పసిడికి ప్రతికూలాంశాలుగా మారాయి. ఫలితంగా రాత్రి అమెరికాలో ఔన్స్‌ పసిడి ధర 8 డాలర్లు నష్టపోయి 1,286.65 స్థిరపడింది. డిసెంబర్‌ 21 తరువాత ఒకేరోజులో పసిడి ఇంత స్థాయిలో క్షీణించడటం ఇది మొదటిసారి కావడం గమనార్హం. వరుసగా మూడోవారం లాభాల్లో(4డాలర్లు) ముగిసిన పసిడి ధర ఈ వారంలో 1,278.20 - 1,300.35 రేంజ్‌లో ట్రేడైంది.
రూపాయి ర్యాలీ - నష్టాల బాటలో పసిడి
దేశీయ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి ర్యాలీ పసిడిని భారీగా దెబ్బతీసింది. పావెల్‌ కీలక వడ్డీరేట్లపై మెతక వైఖరీ వాఖ్యలతో ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ 96స్థాయికి క్షీణించడంతో రాత్రి డాలర్‌ మారకంలో రూపాయి విలువ 44పైసలు ర్యాలీ చేసి 69.73 వద్ద ముగిసింది. ఫలితంగా రూపాయికి వ్యతిరేకంగా ట్రేడయ్యే పసిడి బారీ పతనాన్ని చవిచూసింది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో శుక్రవారం రాత్రి ఫిబ్రవరి కాంట్రాక్టు ధర రూ.333.00లు నష్టపోయి రూ.31456.00ల వద్ద ముగిసింది.



You may be interested

టైమ్ టెక్నోప్లాస్ట్ కొనవచ్చు: కోట‌క్ సెక్యూరిటీస్‌

Saturday 5th January 2019

ప్యాకేజింగ్ రంగ‌ంలో పాతికేళ్లుగా సేవ‌లు అందిస్తున్న టైమ్ టెక్నోప్లాస్ట్ షేరును కొనమ‌ని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ కోట‌క్ సెక్యూరిటీస్ సూచిస్తుంది. టైమ్ టెక్నోప్లాస్ట్ షేరుపై కోట‌క్ విశ్లేష‌ణ‌లు ఎలా  ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..! విశ్లేష‌ణ‌:- ముడి స‌ర‌కు ధ‌రల‌ మార్జిన్లు పెర‌గ‌డంతో ప్రస్తుత ఆర్థిక సంవ‌త్సరం రెండో త్రైమాసికంలోటైమ్ టెక్నోప్లాస్ట్ కంపెనీ బ‌ల‌హీన ఆర్థిక గ‌ణాంకాలకు న‌మోదు చేసింది. అయితే, గ‌త కొన్నివారాలుగా ప్రధాన ముడి సరుకైన హై డెన్షిటీ పాలిథిలిన్ ధ‌ర‌లు

అమెరికా మార్కెట్ల రీ-బౌన్స్‌

Saturday 5th January 2019

అమెరికా మార్కెట్లు శుక్రవారం రాత్రి భారీ లాభాలతో ముగిశాయి. డిసెంబర్‌లో నిరుద్యోగ గణాంకాలు అంచనాలకు మించి నమోదు కావడం, వడ్డీరేట్లపై ఫెడ్‌రిజర్వ్‌ ఛైర్మన్‌ సానుకూల వాఖ్యలు, వచ్చే వారంలో అమెరికా - చైనా దేశాల మధ్య జరగున్న వాణిజ్య చర్చలు అమెరికా మార్కెట్ల సెంటిమెంట్‌కు కలిసొచ్చాయి. ఫలితంగా ఎస్‌&పీ 3.50శాతం లాభపడి 2,531 వద్ద, నాస్‌డాక్‌ కాంపోజిట్‌ 4శాతం పెరిగి 6,738 వద్ద, డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 3.30శాతం ర్యాలీ

Most from this category