News


భగ్గుమన్న బంగారం ధర

Tuesday 23rd October 2018
Markets_main1540287919.png-21408

ప్రపంచ మార్కెట్లో పసిడి ధర మంగళవారం పరుగులు పెడుతోంది. నేడు యూరప్‌ ఔన్స్‌ పసిడి ఏకంగా 19 డాలర్లు లాభపడింది. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, రాజకీయ అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో  అమ్మకాల సునామి నెలకొంది. ఫలితంగా అటు ఆసియా మార్కెట్లతో సహా యూరప్‌ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. మరోవైపు డాలర్‌ మారకంలో యెన్‌ విలువ బలపడింది. సౌది అరేబియా, పాశ్చత్య దేశాల మధ్య ముదిరిన రాజకీయ వివాదాలకు తోడు, బ్రెగ్జిట్‌, ఇటలీ బడ్జెట్‌ తదితర వివాదస్పద అంశాలు మరోసారి తెరపైకి వచ్చా‍యి. సంక్షోభ సమయాల్లో పెట్టుబడి సాధనంగా ఉపయోగించే పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ పెరిగింది. భారత వర్తమానకాల ప్రకారం మధ్యాహ్నం గం.3:00ని.లకు ఔన్స్‌ పసిడి ధర 17.80 డాలర్ల పెరిగి 1237.30 వద్ద ట్రేడ్‌ అవుతోంది.
దేశీయంగానూ దూకుడే:-
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయంగా పసిడి ధర పెరిగింది. ఎంసీఎక్స్‌లో నేటి మధ్యాహ్నం గం.3:00ని.లకు 10 గ్రాముల పసిడి ధర రూ.289.00లు లాభపడి రూ.32183.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

నాలుగోరోజూ నష్టాల ముగింపే

Tuesday 23rd October 2018

34000 దిగువకు సెన్సెక్స్‌ 10150 కిందకు నిఫ్టీ ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి కారణంగా మార్కెట్‌ మంగళవారం భారీ నష్టాలతో ముగిసింది. ముఖ్యంగా ఫార్మా, ఐటీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగ షేర్లలో నెలకొన్న అమ్మకాల సునామి నేడు మార్కెట్‌ నష్టాల ముగింపు కారణమైంది. మరోరెండు రోజుల్లో అక్టోబర్‌ నెల డెరివేటివ్స్‌ కాంట్రాక్టులకు ముగియనుండటంతో కావడం ప్రతికూల ప్రభావం చూపించింది. సెన్సెక్స్‌ 34వేల మార్కును, నిఫ్టీ 10,150 మార్కును కోల్పోయాయి.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 287

బేర్‌మన్న బ్యాకింగ్‌ షేర్లు

Tuesday 23rd October 2018

మిడ్‌సెషన్‌ సమయంలో మార్కెట్‌ పతనంలో భాగంగా బ్యాకింగ్‌ రంగషేర్లలో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ 2శాతం, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1శాతం, నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్‌ 1శాతం క్షీణించాయి. ప్రభుత్వరంగ షేర్లలో అత్యధికంగా ఇండియన్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ షేర్లు 2శాతం నష్టపోయాయి. సిండికేట్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, యూనియన్‌ బ్యాంక్‌ షేర్లు

Most from this category