STOCKS

News


స్థిరంగా పసిడి

Tuesday 23rd April 2019
Markets_main1556012415.png-25293

ప్రపంచమార్కెట్లో పసిడి ధర మంగళవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో మధ్యాహ్నం ట్రేడింగ్‌ సమయానికి 2డాలర్లు నష్టపోయి 1,275.35 డాలర్ల వద్ద స్థిరంగా ట్రేడ్‌త అవుతోంది. ఇరాన్‌ నుంచి దిగుమతయ్యే క్రూడాయిల్‌పై అమెరికా ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయంగా మరోసారి ఉద్రిక్తతలు మొదలయ్యాయి . అలాగే క్రూడాయిలర్‌ ధరలు 6నెలల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతుండటం కూడా పసిడి ధర స్థిరమైన ర్యాలీకి తోడ్పాటును అందిస్తున్నాయి. మరోవైపు ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ అక్కడక్కడే ట్రేడ్‌ అవుతుండం కూడా పసిడి స్థిరమైన ర్యాలీకి కారణవుతోంది. ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ చేస్తున్న నేపథ్యంలో పసిడి 1,274-1,275 డాలర్ల శ్రేణిలో కీలకమైన మద్దతు ధర ట్రేడ్‌ అవుతోందని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
దేశీయంగానూ స్థిరంగానే:- 
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయంగా పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో మధ్యాహ్నం ట్రేడింగ్‌ సమయానికి 10గ్రాముల పసిడి ధర రూ.5లు స్వల్పలాభంతో రూ.31601.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇక దేశీయ ఈక్విటీ మార్కెట్లు కనిష్టస్థాయిల నుంచి రికవరి కావడంతో పాటు ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి బలపడటం పసిడి ఫ్యూచర్లపై అమ్మకాల ఒత్తిడి పెంచుతున్నాయి.



You may be interested

ఈ స్టాకుల్లో కరెక‌్షన్‌కు అవకాశం!

Tuesday 23rd April 2019

సోమవారం ముగింపు ప్రకారం 127 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బేరిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా బలహీనంగా మారిన షేర్లలో సుజ్లాన్‌ ఎనర్జీ, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఆర్‌ఇన్‌ఫ్రా, భెల్‌, ఐడీబీఐ బ్యాంక్‌, టాటా స్టీల్‌, వొకార్డ్‌, స్ట్రైడ్స్‌ ఫార్మా, ఫ్యూచర్‌ కన్జూమర్‌, జేకే పేపర్‌, మార్కసాన్స్‌ ఫార్మా, ధనలక్ష్మి బ్యాంక్‌, టాటా కెమికల్స్‌,

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు రేటింగ్‌ జోష్‌

Tuesday 23rd April 2019

విదేశీ రీసెర్చ్‌ సంస్థ మెక్వారీ ఔట్‌పెర్ఫార్మ్‌ రేటింగ్‌ కేటాయింపుతో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో 6శాతం ర్యాలీ చేశాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.400.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. గతేడాది ప్రమోటర్‌ సుభాస్‌ చంద్ర కంపెనీలో కొంత వాటా విక్రయించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రానున్న 1-2 వారాల్లో ఈ వాటా విక్రయ అంశం ఓ కొలిక్కి వస్తుందని, వాటా కొనుగోలుకు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి

Most from this category