STOCKS

News


భారీగా క్షీణించిన వెండి బంగారాలు.!

Tuesday 9th October 2018
Markets_main1539062995.png-20970

ముంబై:- అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ మార్కెట్లో సోమవారం రాత్రి పసిడి, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. అమెరికా ట్రేడింగ్‌లో ఔన్సు బంగారం ధర 12 డాలర్ల మేర క్షీణిం‍చి 1,188 డాలర్ల వద్దకు చేరడం, వెండి ధర కూడా 2 శాతంపైగా పడిపోవడంతో పాటు గతరాత్రి ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి తొలిసారిగా 74స్థాయికి పైన ముగిసింది. ఫలితంగా గత రాత్రి ఎంసీఎక్స్‌లో 10గ్రాముల ధర ధర రూ.380లు నష్టపోయి రూ.31220ల వద్ద ముగిసింది. ఇక వెండి కేజి వెండి ధర రూ. 800 వరకూ క్షీణించి రూ.38450ల వద్ద ముగిసింది. అయితే మంగళవారం ఉదయం డాలర్‌ మారకంలో రూపాయి కోలుకోవడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర రికవరీ కారణంగా నేడు పసిడి గత రాత్రి ముగింపుతో పోలిస్తే లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. ఎంసీఎక్స్‌ లో మంగళవారం ఉదయం గం.10:30ని.లకు 10గ్రాముల పసిడి రూ.110.00లు లాభపడి రూ.31330.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కేజి వెండి సైతం రూ.220లు(అరశాతం) లాభపడి రూ.38678.00  వద్ద ట్రేడ్‌ అవుతోంది.
అంతర్జాతీయంగా రీకవరీ బాటలో:-
గతరాత్రి వారం కనిష్టానికి పతనమైన పసిడి ధర మంగళవారం ట్రేడింగ్‌లో రికవరీ బాట పట్టింది. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి 7డాలర్ల వరకు లాభపడింది. చైనా ఆర్థిక వృద్ధి నెమ్మదించడం, డాలర్‌ మారకంలో యెన్‌ బలపడటం తదితర కారణాలతో ఆసియా మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. మార్కెట్ల పతనం నేపథ్యంలో ఇన్వెస్టర్లు రక్షణాత్మకంగా పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితం ఔన్స్‌ పసిడి 7డాలర్ల వరకు పెరిగి ఇంట్రాడేలో 1,195.30 గరిష్టాన్ని అందుకుంది.



You may be interested

ఏడేళ్ల కనిష్టానికి టాటా మోటార్స్‌

Tuesday 9th October 2018

తగ్గిన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ అమ్మకాలు టాటా మోటార్స్‌ షేరు మంగళవారం ఏడేళ్ల కనిష్టానికి చేరుకుంది. తన అనుబంధ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ సెప్టెంబర్‌ అమ్మకాలు తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణమైంది. ఈ సెప్టెంబర్‌లో జేఎల్‌ఆర్‌ ప్రపంచ అమ్మకాలు 12.3శాతానికి క్షీణించాయి. మరోవైపు ఇటీవల కాలంలో అటోరంగ షేర్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు టాటామోటర్స్‌ షేరు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా షేరు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే

క్రూడ్‌ తగ్గితే.. మార్కెట్‌ పరుగు!!

Tuesday 9th October 2018

ఒకవేళ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 70 డాలర్లకు వస్తే అప్పుడు స్టాక్‌ మార్కెట్‌లో పెరుగుదల ఉండొచ్చని కోటక్‌ ఏఎంసీ ఎండీ నీలేశ్‌ షా తెలిపారు. ఇప్పటి నుంచి ముందుకెళ్లే కొద్దీ క్రూడ్‌ ధరలు, ఎన్నికలు.. మార్కెట్లను ప్రభావం చేస్తాయని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యలో ఈ విషయాలు వెల్లడించారు. డెట్‌ మార్కెట్‌, క్రెడిట్‌ మార్కెట్‌, కరెన్సీ మార్కెట్‌, ఆయిల్‌ మార్కెట్‌లలో ఒడిదుడుకులు చోటుచేసుకున్నాయని తెలిపారు. క్రూడ్‌

Most from this category