News


పసిడి ర్యాలీకి బ్రేక్‌

Wednesday 17th October 2018
Markets_main1539752886.png-21233

పసిడి రెండు రోజుల ర్యాలీకి బుధవారం బ్రేక్‌ పడింది. ప్రపంచ ఈక్వీటీ మార్కెట్ల లాభాల ట్రేడ్‌, డాలర్‌ ఇండెక్స్‌ ర్యాలీ ఇందుకు కారణమైంది. భారత వర్తమాన కాల ప్రకారం ఉదయం గం.10:15ని.కు ఆసియా మార్కెట్లో ఔన్స్‌ పసిడి 5.60 డాలర్లు నష్టపోయి 1,225 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా మార్కెట్లో నిన్న రాత్రి పసిడి ధర 1,235.90 డాలర్ల వద్ద 3నెలల గరిష్టాన్ని తాకింది. ప్రపంచ మార్కెట్లో నెలకొన్న ఉద్రికత్తలు ఇందుకు కారణమయ్యాయి. చివరకు 7 డాలర్ల లాభంతో 1,231 వద్ద ముగిసింది. నేడు ఆసియాలో 1,228.10 డాలర్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. రాత్రి అమెరికా మార్కెట్లు లాభాల ముగింపును అందుకున్న ఆసియా మార్కెట్లు లాభాలతోనే ట్రేడింగ్‌ ప్రారంభించాయి. డాలర్‌ ఇండెక్స్‌ కూడా గత రాత్రి ముగింపు(94.78)తో పోలిస్తే 0.15శాతం పెరిగి 94.93స్థాయికి చేరుకుంది. ఈ అంశాలు పసిడి ధరకు ప్రతికూలాంశాలుగా మారాయి. ఇంట్రాడేలో 6.20డాలర్లు నష్టపోయి 1,224.80 డాలర్ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది.
దేశీయంగానూ తగ్గుదలే:-
దేశీయంగానూ పసిడి ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ రెండువారాల గరిష్ట స్థాయిని తాకడం ఇందుకు కారణమైంది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో నేడు 10గ్రాముల పసిడి ధర రూ.42.00లు నష్టపోయి రూ.31826.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. మంగళవారం రాత్రి ఎంసీఎక్స్‌లో 10గ్రాముల పసిడి ధర రూ.195లు నష్టపోయి రూ.32ల దిగువన రూ.31868 వద్ద ముగిసింది.



You may be interested

లెనొవొ ‘కే9’ అదిరింది..

Wednesday 17th October 2018

ధర రూ.8,999 ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ లెనొవొ బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ ‘కే9’ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.8,999గా ఉంది. ఇందులోని ప్రత్యేకతలు చూస్తే.. ♦ 5.7 అంగుళాల ఫుల్‌వ్యూ డిస్‌ప్లే ♦ డ్యూయెల్‌ గ్లాస్‌ బాడీ ♦ 13 + 5 ఎంపీ డ్యూయెల్‌ రియర్‌ కెమెరా ♦ 13 + 5 ఎంపీ డ్యూయెల్‌ ఫ్రంట్‌ కెమెరా ♦ 3,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ♦ మీడియాటెక్‌ పీ22 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ ♦ ఆండ్రాయిడ్‌ ఓరియో ఓఎస్‌ ♦ 3 జీబీ ర్యామ్‌ ♦ 32 జీబీ మెమరీ ♦ ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ ♦ బ్లూ, బ్లాక్‌ రంగుల్లో

5,999లకు ఆకర్షణీయమైన ఫోన్‌

Wednesday 17th October 2018

ప్రముఖ మొబైల్‌హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ లెనొవొ తాజాగా అదిరిపోయే ఫీచర్లతో ఎంట్రీ లెవెల్‌ స్మార్ట్‌ఫోన్‌ ‘ఏ5’ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇందులోని ప్రత్యేకలను గమనిస్తే.. ♦ 5.45 అంగుళాల హెచ్‌డీ ఫుల్‌ స్క్రీన్‌ డిస్‌ప్లే ♦ 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ♦ 13 ఎంపీ రియర్‌ కెమెరా ♦ 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ♦ ట్రిపుల్‌ స్లాట్‌ ♦ మీడియాటెక్‌ ఎంటీ 6739 క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌ ♦ ఆండ్రాయిడ్‌ ఓరియో ఓఎస్‌ ♦ ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ ♦ ధర: 2 జీబీ ర్యామ్‌+ 16 జీబీ మెమరీ వేరియంట్‌- రూ.5,999     3 జీబీ ర్యామ్‌+ 32.....

Most from this category