STOCKS

News


రూ.30700ల వద్ద పసిడి ధర

Wednesday 21st November 2018
Markets_main1542778267.png-22257

ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ర్యాలీ పసిడి ధరను దెబ్బతీస్తుంది. నేడు డిసెంబర్‌ కాంట్రాక్టు పసిడి ధర రూ. 30,775.00ల వద్ద ప్రారంభమైంది. గతవరుస ఆరు ట్రేడింగ్‌ సెషన్‌లో డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం పసిడి ధరపై ప్రభావాన్ని చూపుతోంది. ఫలితంగా ఉదయం గం.10:30ని.లకు ఎంసీక్స్‌లో 10గ్రాముల పసిడి ధర క్రితం ముగింపు ధర(రూ. 30814)తో పోలిస్తే రూ.56.00లు నష్టపోయి రూ.30758.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. రూపాయి ర్యాలీ కారణంగా పసిడి ధర ఈ వారంలో ఇప్పటికి వరకు రూ.250లు నష్టపోయింది.
ప్రపంచమార్కెట్లో స్థిరంగా పసిడి ధర:-
ఇక అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర నేడు కూడా స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ఉదయం గం.10:30ని.లకు ఔన్స్‌ పసిడి ధర 0.50డాలర్‌ స్వల్ప లాభంతో 1,221.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది. గతరాత్రి అమెరికా మార్కెట్లో డాలర్‌ ఇండెక్స్‌ తిరిగి పుంజుకోవడంతో పసిడి ధరలు 5రోజలు తరువాత నష్టాల్లో ముగిశాయి. రాత్రి అమెరికా మార్కెట్ల నష్టాల ముగింపు నేపథ్యంలో అక్కడ మార్కెట్లో ఔన్స్‌ పసిడి 1,225.30 డాలర్ల వద్ద ముగిసింది.



You may be interested

ఫారెక్స్‌ మార్కెట్‌కు సెలవు

Wednesday 21st November 2018

ఈద్‌-ఇ-మిలాద్‌ సందర్భంగా భారత్‌లో ఫారిన్‌ ఎక్స్చేంజ్‌, డెట్‌ మార్కెట్లకు బుధవారం రోజు సెలవు. అయితే ఈక్విటీ మార్కెట్లు మాత్రం యథాతథంగా పనిచేస్తున్నాయి. కాగా ఇండియన్‌ రూపాయి మంగళవారం 21 పైసలు లాభంతో 71.46 వద్ద ముగిసింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడుతూ రావడం ఇది ఆరవ సెషన్‌. ఇక భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.79 శాతంగా ఉన్నాయి. డెట్‌, ఫారెక్స్‌ మార్కెట్లలో ట్రేడింగ్‌ తిరిగి గురువారం ప్రారంభమౌతుంది. 

ఏపీలో మెటాలిక్స్‌ విత్తన కేంద్రం

Wednesday 21st November 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టాటా గ్రూప్‌కు చెందిన అగ్రికల్చర్‌ బయోటెక్నాలజీ కంపెనీ మెటాలిక్స్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌లో విత్తన ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌ సీడ్‌ క్యాపిటల్‌గా అభివృద్ధి చెందుతోందని, ఎగుమతులక్కూడా అవకాశం ఉండటంతో ఫ్యాక్టరీ ఏర్పాటుకు నిర్ణయించామని తెలియజేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రెండు విత్తన ఫ్యాక్టరీలతో పాటు కరీంనగర్, వరంగల్, ఏలూరు, కడప వంటి ప్రాంతాల్లో విత్తన ఉత్పత్తి కేంద్రాలున్నాయి. మంగళవారమిక్కడ ‘జెనిటికల్లీ మోడిఫైడ్‌ ఆర్గానిజం’ (జీఎంవో) అనే అంశంపై

Most from this category