News


నెల కనిష్టం వద్ద నిలకడగా పసిడి ధర

Monday 12th November 2018
Markets_main1542001366.png-21894

ఆసియా మార్కెట్ల మిశ్రమ ట్రేడింగ్‌ నేపథ్యంలో సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర నెల కనిష్టం వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. భారత వర్తమానకాలం ప్రకారం ఉదయం గం.10.30లకు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి 1.00 డాలరు స్వల్పలాభంతో 1209.6 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  డిసెంబర్‌లో ఫెడ్‌ రిజర్వ్‌ కీలకవడ్డీ రేట్ల పెంపుపై స్పష్టత రావడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం రాత్రి నెలరోజుల కనిష్టానికి పతనమైన సంగతి తెలిసిందే. క్రూడాయిల్‌ ధరలు కనిష్టస్థాయి నుంచి తిరిగికోలుకోవడం, అక్టోబర్‌లో చైనా ఆర్థిక గణాంకాలు ఆశించిన స్థాయిలో నమోదుకాకపోవడం, అమెరికా ప్రోడ్యూసర్‌ ప్రైస్‌ గణాంకాలు అంచనాలకు మించి నమోదుకావడం.. తదితర కారణాలు ప్రపంచఈక్విటీ మార్కెట్లను ఆందోళనలు రేకిత్తిస్తున్నాయి. అందుకు అనుగుణంగా నేడు ఆసియా పలు మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. మరోవైపు పసిడి ధరలపై ప్రభావాన్ని చూపే డాలర్‌ ఇండెక్స్‌ 16నెలల గరిష్ట స్థాయి నుంచి దిగివస్తుంది. నేడు 0.05 శాతం పెరుగుదలతో 96 వద్ద ట్రేడవుతోంది. ఈ బలహీన పరిణామాలతో నిలకడగా ట్రేడ్‌ అవుతోంది.
దేశీయంగా పెరుగుదల:-
నేడు డాలర్‌ మారకంలో రూపాయి విలువ తగ్గుముఖం పట్టడంతో ఫారెక్స్‌ మార్కెట్లో పసిడి ధర లాభాల బాట పట్టింది. నేడు ఎంసీక్స్‌లో డిసెంబర్‌ కాంట్రాక్టు ధర రూ.31,100ల వద్ద ప్రారంభమైంది. ఉదయం గం.10.30లకు గత ముగింపు ధరతో పోలిస్తే రూ.125లు లాభంతో రూ.31141ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

మార్కెట్ల యూటర్న్‌

Monday 12th November 2018

10,600 మార్క్‌ దిగువున నిఫ్టీ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. లాభాల్లో ప్రారంభమైన బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు తర్వాత తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కారణంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 11:11 సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 29 పాయింట్ల నష్టంతో 35,129 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 2 పాయింట్ల నష్టంతో 10,583 వద్ద ట్రేడవుతున్నాయి.  నిఫ్టీ-50లో టెక్‌ మహీంద్రా, టైటాన్‌ షేర్లు 3 శాతానికిపైగా పెరిగాయి. ఇక ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు 2

ఈ స్టాక్స్‌ను ఏం చేద్దాం?

Monday 12th November 2018

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌        కొనొచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: కేఆర్‌ చోక్సీ ప్రస్తుత ధర: రూ. 1,138 టార్గెట్‌ ధర: రూ.1,461  ఎందుకంటే: కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. రుణాలు 21 శాతం వృద్ధితో రూ.1,849 కోట్లకు పెరిగాయి. రిటైల్‌రుణాలు 28 శాతం, కార్పొరేటర్‌ రుణాలు 17 శాతం పెరగడమే దీనికి ప్రధాన కారణం. నికర వడ్డీ ఆదాయం 16 శాతం (క్వార్టర్‌

Most from this category