ఫెడ్ నిర్ణయం కోసం పసిడి ఎదురుచూపులు
By Sakshi

ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల నిర్ణయం కొరకు ఎదురుచూస్తున్న పసిడి ధర బుధవారం 1250డాలర్ల పైన స్థిరంగా ట్రేడ్ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్ పసిడి ధర 1.55 డాలర్లు ర్యాలీ చేసి 1,255.15 డాలర్లు వద్ద ట్రేడ్ అవుతోంది. నేటి అర్థరాత్రి ఫెడ్ వడ్డీరేట్లను ప్రకటించనున్న సంగతి తెలిసిందే. కీలక వడ్డీరేట్ల పెంపునకు ఫెడ్ మొగ్గుచూపితే డాలర్ ఇండెక్స్ బలపడి పసిడి ధరకు ప్రతికూలాంశం మారుతుంది. పసిడి ధర ప్రస్తుతం 5నెలల గరిష్టస్థాయిల వద్ద ట్రేడ్ అవుతున్న తరణంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పతనంతో క్రితం ట్రేడింగ్ సెషన్లో డాలర్ ఇండెక్స్ వారం కనిష్టానికి చేరుకుంది. ఫలితంగా మంగళవారం ట్రేడింగ్ సెషన్లో పసిడి 2డాలర్లు స్వల్ప లాభంతో 1,253.60 డాలర్ల వద్ద ముగసింది.
రూపాయి ర్యాలీ: కళ తప్పిన పసిడి
ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ర్యాలీతో దేశీయ మార్కెట్లో పసిడి ధర భారీగా నష్టపోతుంది. నిన్నటి ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ ఏకంగా 112 పైసలు బలపడి 70.44ల వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. గత ఐదేళ్లలో ఒక్కరోజులో రూపాయి ఇంతస్థాయిలో బలపడటం ఇదే తొలిసారి కావడం విశేషం. రూపాయి ర్యాలీతో ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ధర ఏకంగా రూ.467లు నష్టపోయింది. నిన్నటి ఇంట్రాడేలో ఒకానొక దశలో రూ.31134ల కనిష్టస్థాయికి పతమైన చివరికి రూ.31163ల వద్ద ముగిసింది. నిన్నటి నష్టాల ట్రేడింగ్‌ను అందుకున్న పసిడి ధర నేడు కూడా నష్టాలతోనే ప్రారంభమైంది. డాలర్ మారకంలో రూపాయి విలువ నేటి ట్రేడింగ్‌లోనూ బలపడంతో పసిడి ధర నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. ఉదయం గం.10:30ని.లకు ఎంసీక్స్లో 10గ్రాముల పసిడి ధర గత ముగింపు ధర(31163)తో పోలిస్తే రూ.73లు నష్టపోయి రూ.31090.00ల వద్ద ట్రేడ్ అవుతోంది.
You may be interested
ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లు జూమ్
Wednesday 19th December 2018ఆర్బీఐ బాండ్ల కొనుగోలు సిద్ధమైన నేపథ్యంలో బుధవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లు లాభాల బాటపట్టాయి. ఎన్ఎస్ఈలో ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 2శాతం లాభపడింది. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యలోటును తీర్చేందుకు వచ్చే నెలలో బాండ్ల బైబ్యాక్ కార్యక్రమం ద్వారా రూ.50వేల కోట్ల నిధులను అందుబాటులోకి తెస్తామని ఆర్బీఐ మంగళవారంప్రకటించింది. ఇప్పటికే ఈ డిసెంబర్లో ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోళ్ల ద్వారా రూ.40వేల
సీఐఈ ఇంక్యుబేటర్‌కు దరఖాస్తుల ఆహ్వానం
Wednesday 19th December 2018హైదరాబాద్: ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ (సీఐఈ) ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇన్ రెసిడెన్సీ (ఈఐఆర్) ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఏడాది పాటు నెలకు రూ.30 వేలు ఉపకారవేతనంతో పాటూ మెంటార్స్, ఇన్వెస్టర్లను కలిసే అవకాశం ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 10. 2009లో ప్రారంభమైన సీఐఈలో ఇప్పటివరకు 160 స్టార్టప్స్ ప్రోత్సాహం అందించింది.