STOCKS

News


3వారాల గరిష్టానికి పసిడి

Thursday 21st March 2019
Markets_main1553152819.png-24724

ఈ ఏడాది వడ్డీరేట్ల పెంపు ఉండదనే ఫెడ్‌ రిజర్వ్‌ సంకేతాలతో గురువారం పసిడి ధర పరుగులు పెడుతోంది. ఆసియాలో ఏకంగా ఔన్స్‌ పసిడి ధర ఏకంగా 17డాలర్లు ర్యాలీ చేసి 3వారాల గరిష్టాన్ని తాకింది. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లపై యధాతధ పాలసీ విధానానికే కట్టబడి ఉన్నట్లు బుధవారం ప్రకటించింది. అలాగే ఈ ఏడాది(2019)లో కూడా వడ్డీరేట్ల పెంపు ఉండకపోవచ్చనే సంకేతాలనిచ్చింది. ఫెడ్‌ రిజర్వ్‌ అంతర్జాతీయ ఆర్థికవృద్ధి మందగనం నేపథ్యంలో అమెరికా జీడీపీ వృద్ధి అంచనా, ద్రవ్యోల్బణ అంచనాలను తగ్గించింది. ఫెడ్‌ రిజర్వ్‌ తాజా నిర్ణయంతో అటు డాలర్, ఇటు ట్రెజరీ ఈల్డ్స్‌ ఒక్కసారిగా నీరసించిపోయాయి. అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్‌ ఏడాది కనిష్టానికి పతనమవగా, ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ 6వారాల కనిష్టానికి క్షీణించింది. ఫలితంగా నేటి ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి 17డాలర్ల భారీ ర్యాలీ చేసి 1,318 డాలర్ల వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. ఇది పసిడి ధరకు మూడు వారాల గరిష్టస్థాయి కావడం విశేషం. 
దేశీయంగా నేడు సెలవు:- 
నేడు హోళీ సందర్భంగా ఉదయం ఎంసీఎక్స్‌కు మార్కెట్‌కు సెలవు. కాబట్టి ఫారెక్స్‌ మార్కెట్లో పసిడి ట్రేడింగ్‌ జరగడం లేదు. అయితే బుధవారం రాత్రి ఎంసీక్స్‌లో 10గ్రాముల పసిడి ధర రూ.263లు మేర నష్టపోయింది. డాలర్‌ మారకంలో రూపాయి రికవరీ ఇందుకు కారణమైంది. నిన్నటి ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి 13పైసలు బలపడి 68.83 వద్ద ముగిసింది.



You may be interested

ఓఎంసీలపై సీఎల్‌ఎస్‌ఏ అప్రమత్తత!

Thursday 21st March 2019

చమురు మార్కెటింగ్‌ కంపెనీల(హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ, బీపీసీఎల్‌) షేర్లపై అప్రమత్తంగా ఉన్నట్లు ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ తెలిపింది. ఈ షేర్లన్నీ గత నెల రోజుల్లో దాదాపు 30 శాతం వరకు ర్యాలీ జరిపాయి. ఈ నేపథ్యంలో వీటిపై ఇచ్చిన ‘అమ్మొచ్చు’ కాల్‌ను కొనసాగిస్తున్నట్లు సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. ప్రపంచంలోనే ఇవి వాల్యూషన్లు అత్యధికంగా ఉన్న రిఫైనరీ కంపెనీల షేర్లని తెలిపింది. క్రూడాయిల్‌ ధరలో క్రమానుగత పెరుగుదల ఈ కంపెనీలపై నెగిటివ్‌ ప్రభావం

11600 పాయింట్ల వద్ద కన్సాలిడేషన్‌!

Thursday 21st March 2019

నిఫ్టీ గతేడాది నవంబర్‌ తర్వాత వీక్లీ చార్టుల్లో బలమైన బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పరిచింది. ఈ వారం 11556 పాయింట్ల వరకు చేరింది. ఇదే ధోరణి మరింత కొనసాగవచ్చని నిపుణుల అంచనా. చార్టుల్లో హయ్యర్‌ లో ఫార్మేషన్‌ జరిగినంతవరకు ఇదే జోరు ఉంటుంది. నాలుగువారాల్లో నిఫ్టీ దాదాపు వెయ్యి పాయింట్లు పైకి ఎగిసింది. ప్రస్తుతం స్టోకాస్టిక్‌ ఇండికేటర్‌ ఓవర్‌బాట్‌లో ఉంది. అందువల్ల కొంత మేర వెనుకంజ ఉండొచ్చని అంచనా. ఈ వెనుకంజలో

Most from this category