STOCKS

News


2వారాల కనిష్టానికి పసిడి

Wednesday 31st October 2018
Markets_main1540964970.png-21601

డాలర్‌ ఇండెక్స్‌ పటిష్టమైన ర్యాలీ కారణంగా బుధవారం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర రెండు వారాల కనిష్టస్థాయికి పతనమైంది. గత రాత్రి అమెరికా ప్రకటించిన యూఎస్‌ కన్జ్యూమర్‌ కాన్ఫిడెన్స్‌ ఇండెక్స్‌ 18 ఏళ్ల గరిష్టానికి చేరడంతో పాటు రానున్న రోజుల్లో ఆర్థిఖ వ్యవస్థ మరింత వృద్ధి చెందుతునే అంచానాలు నెలకొన్నాయి. పలితంగా ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ 97.054 స్థాయిని తాకింది. ఈ స్థాయికి డాలర​ ఇండెక్స్‌ 16నెలల గరిష్టస్థాయి. మరోవైపు చిప్‌, టాన్స్‌పోర్ట్‌ కంపెనీల షేర్ల ర్యాలీ కారణంగా మంగళవారం రాత్రి అమెరికా మార్కెట్లు లాభాలో ముగిశాయి. ఈ కారణాలు పసిడి ధరకు ప్రతికూలాంశాలుగా మారాయి. ఫలితంగా పసిడి ధర రాత్రి అమెరికా మార్కెట్లో పసిడి ధర 1,225.30 వద్ద నష్టాల్లో ముగిసింది. గత నష్టాల ర్యాలీ అందుకున్న పసిడి నేడు ఆసియా ట్రేడింగ్‌లో నష్టాలతోనే ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేడు ఆసియాలో సైతం పలు మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతుండటం, డాలర్‌ ఇండెక్స్‌ పటిష్టమైన ర్యాలీ తదితర అంశాల కారణంగా పసిడి ధర ఇంట్రాడేలో  8డాలర్లు నష్టపోయి 1,217.20 డాలర్ల కనిష్టానికి పతనమైంది. ఇది పసిడికి 2వారాల కనిష్టస్థాయి. ఆసియాలో ట్రేడింగ్‌లో భారత వర్తమానకాల ప్రకారం  ఉదయం గం.10:45ని.లకు  ఔన్స్‌ పసిడి ధర 6డాలర్లు నష్టంతో 1,219.20 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
దేశీయంగా పసిడి పెరుగుదల
ప్రపంచమార్కెట్లో పసిడి ధర నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., దేశీయంగా మాత్రం డాలర్‌ మారకంలో రూపాయి పతనం కారణంగా స్వల్పంగా లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. కేంద్ర ప్రభుత్వానికి, ఆర్‌బీఐకి తలెత్తిన విభేదాల కారణంగా డాలర్‌ మారకంలో రూపాయి 74 స్థాయికి పతనమైంది. ఈ అంశం దేశీయ పసిడి ఫ్యూచర్లకు కలిసొచ్చింది. నేడు ఎంసీక్స్‌లో 10గ్రాముల పసిడి ధర రూ.45.00లు లాభపడి రూ.31882.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

టాటాస్టీల్‌ షేరు ఈయూ షాక్‌..!

Wednesday 31st October 2018

టాటా స్టీల్‌కు యూరోపియన్‌ యూనియన్‌ షాక్‌నిచ్చింది. యూరప్‌లో ఏర్పాటయ్యే టాటా స్టీల్, జర్మనీ స్టీల్ కంపెనీ థిసేన్‌క్రుప్‌ల భాగస్వామ్య కంపెనీతో ఏర్పడే జాయింట్‌ వెంచర్‌పై దర్యాప్తుకు కమీషన్‌ను ఏర్పాటు చేయడంతో​ టాటాస్టీల్‌ కంపెనీ షేరు బుధవారం బీఎస్‌ఈలో 6శాతం పతమనమైంది. నేడు షేరు రూ.556.80ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఈయూ కమీషన్‌ ఏర్పాటు వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లు షేరు అమ్మకాలు మొగ్గుచూపారు. ఫలితంగా ఇంట్రాడేలో షేరు  6శాతం నష్టపోయి రూ. 530.10ల

 74 దిగువకు రూపాయి క్రాష్‌

Wednesday 31st October 2018

ఒకవైపు ప్రపంచ ప్రధాన కరెన్సీలతో డాలరు గత రాత్రి భారీగా బలపడటంతో పాటు...ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి, ఆర్‌బీఐకి తీవ్ర విభేదాలు తలెత్తాయని వచ్చిన వార్తలకు స్పందనగా డాలరు మారకంలో రూపాయి విలువ నిట్టనిలువునా పతనమయ్యింది. బుధవారం ఉదయం 10 గంటల సమయానికి రూపాయి 45 పైసల మేర క్షీణించి 74.13 వద్దకు పడిపోయింది. క్రితం రోజు 20 పైసల వరకూ తగ్గిన రూపాయి..ఈ రెండు రోజుల్లో 1 శాతం వరకూ

Most from this category